– చెంగిచెర్లలో పలు ఇళ్లల్లో భారీ చోరీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16: హైదరాబాద్ నగర శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల ముఠా హల్‌చల్ చేసింది. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో దొంగల ముఠా కత్తులు, ఇతర ఆయుధాలతో చెంగిచెర్ల కాలనీలో సంచరించింది. ముందుగానే రెక్కీ నిర్వహించుకుని కారులో వచ్చిన ఈ ముఠా దాదాపు 12 ఇళ్లల్లో జొరబడి నగదు, బంగారం, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులను దోచుకుంది. తమ ఇళ్లలో దొంగతనం జరిగినట్లు గుర్తించిన బాధితులు వెంటనే మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో కలిసి ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు చోరీ జరిగిన ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాల ఆధారంగా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. పండుగ సమయంలో చాలామంది స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఇళ్లు ఖాళీగా ఉండటాన్ని అదనుగా భావించి దొంగలు దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా, సంక్రాంతి సమయంలో స్వగ్రామలకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని, పొరుగువారికి సమాచారం ఇవ్వాలని, సీసీటీవీలు, అలారం సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచనలు చేశారు. త్వరలోనే దొంగల ముఠాను పట్టుకుంటామని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



