– ముక్కుకు తాకితే స్పృహ కోల్పోవడమే
– మహిళలే టార్గెట్‌గా కొత్త తరహాలో చోరీలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : షాపింగ్ మాల్స్, థియేటర్లు, పార్కింగ్ స్థలాలు.. ఇలా ఎక్కడ జనసంచారం ఎక్కువగా ఉంటే అక్కడ కొత్త తరహా కేటుగాళ్లు తిష్ట వేస్తున్నారు. కేవలం ఒక పరిమళాన్ని చూపించి మహిళలను నిలువునా ముంచేస్తున్నారు. సెంటు వాసన చూడమంటూ వచ్చి, ప్రాణాంతకమైన మత్తు మందును వాడటం ద్వారా దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు ఇప్పుడు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి.
కేవలం మాల్స్ లోపలే కాదు, పార్కింగ్ సెల్లార్లలో కూడా ఇలాంటి ముఠాలు సంచరిస్తున్నట్లు సమాచారం. తక్కువ ధరకే బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ ఇస్తామంటూ కార్ల వద్దకు వచ్చి బురిడీ కొట్టిస్తున్నారు. పర్ఫ్యూమ్ పేరుతో వారు వాసన చూపించేది ‘ఆక్స్టర్’ వంటి తీవ్రమైన మత్తు కలిగించే రసాయనం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరగానే సెంట్రల్ నెర్వస్ సిస్టమ్‌ను తాత్కాలికంగా మొద్దుబారిపోయేలా చేసి మనిషిని అపస్మారక స్థితిలోకి తీసుకెళ్తుంది.
పరిచయం లేని వారిని నమ్మకండి.. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా ఏదైనా వాసన చూడమని గానీ, రుచి చూడమని గానీ ఇస్తే సున్నితంగా తిరస్కరించండి. అనుమానాస్పద వ్యక్తులు మీ వద్దకు వస్తే వెంటనే సెక్యూరిటీ గార్డులకు లేదా మాల్ సిబ్బందికి సమాచారం ఇవ్వండి.
ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పార్కింగ్ స్థలాల్లో కార్ల దగ్గరకు వెళ్లేటప్పుడు అపరిచితులతో మాట్లాడకండి.
మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండండి. ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఇలాంటి సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిదే. అయితే ఇలాంటి ఘటనలు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. భయం కంటే అవగాహనే మనల్ని కాపాడుతుంది.
‘పర్ఫ్యూమ్ షాక్’.. అసలేం జరుగుతోంది?
కోయంబత్తూరులోని బ్రూక్‌ఫీల్డ్ మాల్లో ఇటీవల జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. బాధిత మహిళా కథనం ప్రకారం.. ఆమె థియేటర్ బాత్రూమ్లోకి వెళ్లినప్పుడు ఒక అపరిచిత మహిళ పర్ఫ్యూమ్ బాటిల్‌ను చూపిస్తూ, ఆ వాసన ఎలా ఉందో చెప్పాలని కోరింది. అది వాసన చూసిన కొన్ని క్షణాల్లోనే ఆ మహిళ స్పృహ కోల్పోయింది. ఆమె కళ్లు తెరిచేసరికి ఒంటిపై ఉన్న నగలు, బ్యాగ్, ఇతర వస్తువులు మాయమయ్యాయి.
పార్కింగ్ స్థలాలే అడ్డాగా..
కేవలం మాల్స్ లోపలే కాదు, పార్కింగ్ సెల్లార్లలో కూడా ఇలాంటి ముఠాలు సంచరిస్తున్నట్లు సమాచారం. తక్కువ ధరకే బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ ఇస్తామంటూ కార్ల వద్దకు వచ్చి బురిడీ కొట్టిస్తున్నారు. పర్ఫ్యూమ్ పేరుతో వారు వాసన చూపించేది ‘ఆక్స్టర్’ వంటి తీవ్రమైన మత్తు కలిగించే రసాయనం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరగానే సెంట్రల్ నెర్వస్ సిస్టమ్‌ను తాత్కాలికంగా మొద్దుబారిపోయేలా చేసి మనిషిని అపస్మారక స్థితిలోకి తీసుకెళ్తుంది.
మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఇలా
పరిచయం లేని వారిని నమ్మకండి.. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా ఏదైనా వాసన చూడమని గానీ, రుచి చూడమని గానీ ఇస్తే సున్నితంగా తిరస్కరించండి. అనుమానాస్పద వ్యక్తులు మీ వద్దకు వస్తే వెంటనే సెక్యూరిటీ గార్డులకు లేదా మాల్ సిబ్బందికి సమాచారం ఇవ్వండి.
ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పార్కింగ్ స్థలాల్లో కార్ల దగ్గరకు వెళ్లేటప్పుడు అపరిచితులతో మాట్లాడకండి.
మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండండి. ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఇలాంటి సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిదే. అయితే ఇలాంటి ఘటనలు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. భయం కంటే అవగాహనే మనల్ని కాపాడుతుంది.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.