హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి7: కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధి సర్దార్ పటేల్ నగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దొంగలు 15 తులాల వెండి, 3 తులాల బంగారు ఆభరణాలు, వెండి, పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. బుధవారం తెల్లవారుజామున రోజువారీ పూజల కోసం ఆలయాన్ని తెరిచిన పూజారులు చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. నిందితులు ఆలయంలోకి ప్రవేశించి చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఫుటేజీని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




