– సిరిసిల్ల మున్సిపాలిటీలో27 స్థానాలు సాధించిన బీఆర్ఎస్
– తలలు పట్టుకున్న కాంగ్రెస్ నేతలు
– నాయకత్వ, సమన్వయ లోపమే కారణం
సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర ఫిబ్రవరి25: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘంపై మరోసారి బీఆర్ఎస్ జండా ఎగురవేసింది గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ 22 స్థానాలు గెలుపొందగా ప్రస్తుతం అధికారంలో లేకపోయినప్పటికీ 27 స్థానాలు దక్కించుకుంది. మరో మూడు స్థానాలు కొద్ది ఓట్ల తేడాతో కోల్పోయింది. ఇప్పటికీ మూడోసారి బీఆర్ఎస్ పార్టీ మున్సి పల్ పై జెండా ఎగురవేసి హ్యాట్రిక్ సాధించింది. ఏదిఏమైనప్పటికీ సిరిసిల్ల కాంగ్రెస్ నేతల వైఫల్యమే ఈ ఓటమికి కారణమని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీలో నాయకులే
తప్ప కార్య కర్తలు లేరనేది ఈ ఎన్నికలను బట్టి చూస్తే తెలుస్తుంది. టిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి రెండేళ్లు గడిచినప్పటికీ సిరిసిల్లలో తమ ఉనికి అలాగే కాకుండా రెట్టింపైందని ఈ ఎన్నికలను బట్టి కనిపించింది బిజెపి గతంలో మూడు స్థానాల నుంచి ప్రస్తుతం ఐదు స్థానాలు గెలుపొందడం చూస్తే కొంత పుంజుకున్నట్లే కనిపిస్తుంది.ఈ మూడేళ్లలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసి కాంగ్రెస్ ముఖ్య నేతలు తలలు పట్టుకున్నారు. ఎన్నికల్లో జరిగిన పరాభావాన్ని తట్టుకోలేక వారు ము ఖం చాటేస్తున్నారని కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం పార్టీలో నాయకత్వ లోపం, ముఖ్య నేతల మధ్య సమన్వయమేనని అధిష్టానం గుర్తించినట్లు తెలుస్తోంది. పార్టీలోని కొన్ని పదవులపై కీలక మార్పులు చేయనున్నట్లు అత్యంత విశ్వాసనీయ సమాచారం. మరో వైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ సిరిసిల్లలో మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషించక తప్పడంలేదు. ఏదిఏమైనాప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లలో అట్టర్ ఫ్లాప్ అయినట్లు ప్రజలు ఈ తీర్పు ద్వారా చెప్పకనే చెప్పారు. సిరిసిల్లలోని నాయకులలో నాయకత్వ లోపం కనిపిస్తున్నది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





