– రేపటి నుంచి గ్రామీణ క్రీడా పోటీలు ప్రారంభం
– ఉత్సాహంగా క్రీడాజ్యోతి ర్యాలీలు
– అసెంబ్లీ స్థాయిలో మొట్ట మొదటిసారి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16: రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శాఖ ఆధ్వర్యంలో క్రీడా ప్రాధికార సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న రెండో విడత సీఎం కప్ 2025 కు ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శనివారం నుంచి గ్రామీణస్థాయి పోటీలు ప్రారంభం కానున్నాయి. ఐదు అంచలుగా గ్రామీణ, మండల, అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ పోటీలు జరగనున్నాయి. 17 నుండి 23 వ తేదీ వరకు గ్రామస్థాయి పోటీలు నిర్వహించనున్నారు .అందులోని విజేతలను మండల స్థాయికి మండల స్థాయిలో విజేతలైన వారిని నియోజకవర్గ స్థాయికి ఆ తదుపరి జిల్లా స్థాయికి జిల్లాస్థాయి విజేతలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. ఈసారి అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలో పోటీ నిర్వహించడం విశేషం. కథ సీఎం కప్ 20 24 పోటీలు నాలుగు అంచల్లో గ్రామీణ మండల జిల్లా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించగా దాదాపు 3 లక్షల మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈసారిఅసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో కూడా పోటీలు నిర్వహిస్తుండడంతో 5 అంచెలుగా ఈ పోటీలు కొనసాగనున్నాయి. గ్రామ పంచా యతీ స్థాయిలో 17 జనవరి నుండి 22 జనవరి వరకు, మండల, మున్సిపాలిటీ పరిధిలో 28 జనవరి నుండి 31 జనవరి వరకు, అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలో 3 నుండి 5 ఫిబ్రవరి వరకు, జిల్లా స్థాయి పోటీలు 9 ఫిబ్రవరి నుండి 12వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు ఫిబ్రవరి 20 నుండి 23 వరకు నిర్వహించాలని స్పోర్ట్స్ అథారిటీ ఏర్పాట్లు చేస్తోంది. యువ క్రీడాకారుల్లో అవగాహన కల్పించేందుకు క్రీడా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్నిమండల కేంద్రాల్లో క్రీడాజ్యోతి ర్యాలీలు నిర్వహించారు. యువ క్రీడాకారులు ఉత్సాహవంతంగా ఈ ర్యాలీలలో పాల్గొన్నారు. దాదాపు రెండు లక్షల మంది క్రీడాకారులు ఇప్పటికే ఆన్ లైన్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. పల్లెల నుండి ప్రపంచ ఛాంపియన్లను తీర్చిదిద్దాలని 2036 ఒలంపిక్ క్రీడల్లో తెలంగాణ ప్రాతినిధ్యం ఉన్నతంగా ఉండాలన్న లక్ష్యంతో క్రీడలకు పెద్దపీట వేస్తూ గ్రామీణ క్రీడాకారులను గుర్తించే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు మట్టిలో మాణిక్యాలను గుర్తించే లక్ష్యంతో గత సంవత్సరం నిర్వహించిన సీఎం కప్ విజయవంతమైందని అదే స్ఫూర్తితో రెండో విడత సీఎం కప్ 20 25 నిర్వహిస్తున్నామని ఇందులో గ్రామీణ క్రీడాకారులు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పిలుపునిచ్చారు.
పోటీల విజయవంతంలో క్రీడా సంఘాల భాగస్వామ్యం, సమన్వయం ఉంటుందని పిఈటిలు, ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. సెకండ్ ఎడిషన్ సీఎం కప్-2025 సాంకేతిక సహకారంతో గ్రామీణ క్రీడాకారులకు సంపూర్ణ సమాచారం అందించేందుకు ఏర్పాట్లు చేశామని స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి తెలిపారు. ఏఐ కాల్ సెంటర్,వాట్సాప్ బట్, వెబ్సైట్, ఏఐ చాట్ బాట్ తో సమగ్ర సమాచారం గ్రామీణ క్రీడాకారులకు అధికారులకు అందే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారుల సమాచారం సేకరించి వారి వివరాలను కంప్యూటీకరించి వారి సమగ్ర సమాచారం భద్రపరచడానికి స్పోర్ట్స్ అథారిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




