పంచాయ‌తీలోని వారే మున్సిపాల్టీలోనూ..

– తప్పుడు పద్ధతిలో నమోదైన ఓట్లను తొలగించాలి
– ఈసీకి ములుగు టౌన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఫిర్యాదు

ములుగు, ప్రజాతంత్ర, జనవరి 17: పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ములుగు మున్సిపాలిటీలో తప్పుడు పద్ధతిలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, ఓటరు జాబితా నుంచి వారి పేర్లను తొలగించాలని ఎన్నికల కమిషనర్‌ సుదర్శన్‌ రెడ్డికి, సంబంధిత అధికారులకు కాంగ్రెస్‌ పార్టీ ములుగు పట్టణ శాఖ అధ్యక్షుడు చింతనిప్పుల బిక్షపతి ఫిర్యాదు చేశారు. అక్రమ పద్ధతుల్లో మున్సిపాలిటీలో ఓటర్లుగా నమోదు చేసుకున్న పలువురి వివరాలను ఆధారాలతో సమర్పించారు. భిక్షపతి ఫిర్యాదుపై ఎన్నికల కమిషనర్‌ సుదర్శన్‌ రెడ్డి సానుకులంగా స్పందించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని తప్పుడు పద్ధతుల్లో మున్సిపాలిటీల్లోనూ ఓటు హక్కు నమోదు చేసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భిక్షపతి ఫిర్యాద పై తక్షణం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *