– మాపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు
– కోరం లేకనే ఛైర్మన్ ఎన్నిక వాయిదా
– మంత్రి వివేక్ వెంకటస్వామి వివరణ
మంచిర్యాల,ప్రజాతంత్ర,ఫిబ్రవరి18: బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ తీరుపై మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్ తమపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. ఇదేం పద్ధతంటూ ఈ విషయంలో బాల్క సుమన్‌ని హరీశ్‌రావు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. క్యాతనపల్లిలో మంత్రి వివేక్ మీడియాతో బుధవారం మాట్లాడారు. పట్టణంలో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. సుమన్ దౌర్జన్యం అందరూ చూశారన్నారు. ఆయన ఆరోపణలన్నీ అబద్దాలేనని మండిపడ్డారు. ఆయన రెచ్చగొట్టి డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహించారు. మొదటిరోజు కోరం లేక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికని వాయిదా వేశామని మంత్రి తెలిపారు. రెండోరోజు బయటివాళ్లు వచ్చి గొడవ చేశారని, ఆ కారణంగా రెండోరోజు వాయిదా పడిందని అన్నారు. ఎన్నిక ప్రాసెస్‌ను తాము అడ్డుకోలేదని స్పష్టం చేశారు. బాల్క సుమన్ తమ మీద రాళ్లు విసిరారని, దాడి చేశారని ఆరోపించారు. రెండురోజులుగా సుమన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో చెన్నూరు, క్యాతనపల్లిలో సరిగా ఎన్నికలు జరగలేదని, గుండాయిజంతో మున్సిపల్ ఎన్నికలు ఏకగ్రీవం చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో అధికార దుర్వినియోగం చేశారని, బీఆర్‌ఎస్ నేతలు క్యాంపు పెట్టుకుంటే తాము గొడవ చేశామా అని మంత్రి వివేక్ ప్రశ్నల వర్షం కురిపించారు. తాము ఎలాంటి అధికార దుర్వినియోగం చేయలేదని తేల్చిచెప్పారు. మంత్రి, ఎంపీ కార్లపై రాళ్లు విసరడం సరైనదేనా అని నిలదీశారు. తమపై దాడిని ఖండిస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ఇంకా అధికారంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని ఫ, బీఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోయిన బాధలో సుమన్ తమపై ఫ్రస్టేషన్ చూపుతున్నారని ఫైర్ అయ్యారు. హరీశ్‌రావుకు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే సుమన్ తమపై చేసిన దాడిని ఖండించాలన్నారు. తాము చెన్నూరులో ఏరోజూ బీఆర్‌ఎస్‌పై దాడి చేయలేదని, ఎవరినీ అరెస్ట్ చేయలేదని మంత్రి వివేక్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.