ప్ర‌జ‌ల‌కే బ‌ల‌మైన విప్ల‌వ‌శ‌క్తిని నిర్మిచే శ‌క్తి!

“గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ విధానాలు క్రమంగా వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థల నియంత్రణలోకి తీసుకువచ్చేలా మారుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 83.5 శాతం గ్రామీణ కుటుంబాల వద్ద 1 హెక్టారు కంటే తక్కువ భూమి ఉన్నది. దీంతో కొందరి వద్దనే భూమి కేంద్రీకరణ పెరిగి, ఉపాధి లేమితో ప్రజలు వలసపోతున్నారు.రైతు ఉద్యమం కేవలం చట్టాల రద్దుకు మాత్రమే పరిమితం కాలేదు. అది శ్రమ, పెట్టుబడి మధ్య జరుగుతున్న నూతన పోరాటాన్ని సూచించింది. కనీస మద్దతు ధర (ఎంఎస్ పీ) కోసం పోరాటం అంటే, తన శ్రమకు సరైన విలువను కోరడం అని అర్థం. ఈ పోరాటంలో వివిధ కులాల, ప్రాంతాల రైతులు ఐక్యమవ్వడం భారత విప్లవోద్యమాలకు ఒక కొత్త పాఠాన్ని నేర్పింది.”

– మేకల ఎల్లయ్య,
    సీనియర్ జర్నలిస్ట్,
    సెల్ : 9912178129

మార్క్సిజం  మారుతున్న సామాజిక భౌతిక పరిస్థితులను అర్థం చేసుకునే ఒక శాస్త్రీయ పరికరం. ప్రపంచంలో నిరంత‌ర మార్పుస‌హ‌జం. గమనమే వ్యవస్థల ఉనికికి ఆధారం. నేడు భారత సమాజంలో ప్రజా స్వామ్య ప్రక్రియ మొత్తం నగదు చుట్టూ తిరగడం వంటి పరిణామాలను లెనిన్ చెప్పినట్టు కేవలం గత స్మృతుల’ వైపు చూసే వృద్ధాప్య ధోరణిగా మాత్రమే చూడకూడదు. మార్క్స్ తన పెట్టుబడి’ (కేపిటల్) గ్రంథాన్ని సరుకు విశ్లేషణతోనే ప్రారంభించారు. నేటి భారత సమాజంలో సరుకు పాత్ర ఏమిటిఉత్పత్తిలో మనుషుల మధ్య సంబంధాలు ఎలా మారుతున్నాయి అనే ప్రశ్నల చుట్టూనే కమ్యూనిస్టుల వ్యూహాలుఎత్తుగడలు ఆధారపడి ఉండాలి. భారతదేశంలో నేడు డబ్బు’ పెత్తనం పెర‌గ‌డం మార్క్స్ వివరించిన సరుకు రూపం’ సమాజంలోని అన్ని మూలలకూ విస్తరించిందనే దానికి నిదర్శనం. ఒక వస్తువు వినియోగం కోసం కాకుండాకేవలం లాభం కోసం మారకం చేయడానికి ఉద్దేశించినప్పుడు అది సరుకుగా మారుతుంది. ఆధునిక భారతీయ సమాజంలో కేవలం వస్తువులే కాదుసేవలుసమాచారంచివరికి రాజకీయ నిర్ణయాధికారం కూడా సరుకుగా మారిపోయాయి. 175 ఏండ్ల క్రితమే కమ్యూనిస్టు ప్రణాళికలో పేర్కొన్నట్టు,  ఆధునిక పరిశ్రమ ప్రపంచ మార్కెట్‌ను సృష్టించింది.

భారతదేశం ఏ విధమైన సామాజిక వ్యవస్థను కలిగి ఉందనే విషయంలో కమ్యూనిస్టు మేధావుల మధ్య  రెండు విరుద్ధమైన ధోరణులు  కనిపిస్తాయి. మొద‌టిది భారతదేశం ఇప్పటికే ఒక పరిపూర్ణ పెట్టుబడిదారీ దేశంగా మారిందనిఇక్కడ ప్రధాన వైరుధ్యం శ్రమకు,  పెట్టుబడికి మధ్య ఉందని వీరు వాదిస్తారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఒక వేదికగా ఉపయోగించుకుంటూ ప్రజలలో విప్లవ చైతన్యాన్ని పెంచాలని వీరు భావిస్తారు. రెండు అర్ధ వలసఅర్ధ భూస్వామ్యం. భారతదేశం ఇంకా భూస్వామ్య అవశేషాల నుంచి విముక్తి పొందలేదనిఅదే సమయంలో సామ్రాజ్యవాద శక్తుల పరోక్ష నియంత్రణలో ఉందని మావోయిస్టులు వాదిస్తారు. ఇక్కడ ప్రధాన శత్రువులు సామ్రాజ్యవాదందలారీ బ్యూరోక్రాట్ పెట్టుబడిదారీ వర్గంభూస్వామ్య వర్గం అని వీరు పేర్కొంటారు. మావోయిస్టుల నిర్వచనం ప్రకారం,  భారతదేశం  1947 ఆగస్టు 15న పొందిన స్వాతంత్య్రం కేవలం నామమాత్రమైంది. బ్రిటీష్ వారు నేరుగా పాలించడం మానేసితమ ప్రయోజనాలను కాపాడే స్థానిక దలారీలకు అధికారాన్ని అప్పగించారని వీరు చెపుతారు.

ఆధునిక ఆర్థిక గణంకాలు ఈ వాదనలోని కొన్ని అంశాలను సవాలు చేస్తున్నాయి. భారత దేశ పాలకవర్గాలకు అంతర్జాతీయ వేదికలపై బేరసారాలాడే శక్తి  పెరిగిందని స్పష్టమవుతున్నది. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి సందర్భాల్లో భారతదేశం తన సొంత వ్యూహాలను అనుసరించడంవిదేశీ పెట్టుబడులను (ఎఫ్ డీఐ) ఆకర్షించడంలో చూపిస్తున్న చొరవ దేశ పాలకవర్గానికి కొంత స్వతంత్ర అస్తిత్వం ఉందని సూచిస్తున్నాయి. అయినప్పటికీఉత్పత్తి సాధనాలపై విదేశీ గుత్తాధిపత్యంసాంకేతికత కోసం పాశ్చాత్య దేశాలపై ఆధారపడడం అర్ధ వలస’ లక్షణాలను ఇంకా సజీవంగానే ఉంచుతున్నాయి. 2024-25 లో స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(గ్రాస్ ఎఫ్ డీఐ) $55.6 బిలియన్లు (తొలి 8 నెలలు)గా నమోదైంది.

ఇది 17.9 శాతం వార్షిక వృద్ధిగా ఉన్నది. ఇది విదేశీ  పెట్టుబడిపై పెరుగుతున్న ఆధారంగా కనిపిస్తున్నది. సేవల ఎగుమతులు 12.8 శాతం వృద్ధి చెందడం ప్రపంచ మార్కెట్ తో అనుసంధానాన్ని తెలుపుతున్నది. ఇది డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతున్నది. విదేశీ మారక నిల్వలు $640.3 బిలియన్లుగా వృద్ధి చెందడం బాహ్య ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని తెలుపుతున్నది. పారిశ్రామిక రంగ వృద్ధి 6.2 శాతం పెరగడం పెట్టుబడిదారీ సంబంధాల విస్తరణను చూపుతున్నది.  నేటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లోపాత రకం భూస్వాములు ఇప్పుడు కాపిటలిస్ట్ ల్యాండ్లార్డ్స్గా అవతరించారు. వీరు కాంట్రాక్టులురియల్ ఎస్టేట్వడ్డీ వ్యాపారం ద్వారా కూడా సంపాదిస్తున్నారు.

 శాస్త్రీయ దృక్పథం లేని విప్లవం కేవలం భావోద్వేగంగా మిగిలిపోతుంది. “పోరాట రూపం మారవచ్చు, కానీ పోరాటపు సారం మారజాలదు” అనే నిజాన్ని ప్రజలకు వివరించాలి. మార్క్సిజం చెప్పే మార్పు అనేది గాలిలో నుంచి వచ్చేది కాదు. అది సమాజంలో పెరుగుతున్న వైరుధ్యాల నుంచి పుడుతుంది.  విప్లవకారులు తమ వ్యూహాలను పాత పుస్తకాల నుంచి కాకుండా, నేటి వీధుల నుంచి, స్మార్ట్ ఫోన్ల నుంచి, అప్పుల పాలైన రైతుల కండ్లలో నుంచి రూపొందించుకోవాలి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.  నేటి భారత సామాజిక పరిస్థితుల్లో మార్క్సిజం ప్రాతిపదికన ఒక బలమైన, శాస్త్రీయమైన,  సమగ్రమైన విప్లవ శక్తిని నిర్మించే మార్పు ప్రజలే  తీసుకురావాలి.

గత దశాబ్ద కాలంలో  ప్రభుత్వ విధానాలు క్రమంగా వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థల నియంత్రణలోకి తీసుకువచ్చేలా మారుతున్నాయి.  ప్రస్తుతం దేశంలో  83.5 శాతం  గ్రామీణ కుటుంబాల వద్ద హెక్టారు కంటే తక్కువ  భూమి ఉన్నది. దీంతో కొందరి వద్దనే భూమి కేంద్రీకరణ పెరిగి,  ఉపాధి లేమితో ప్రజలు వలసపోతున్నారు.  రైతు ఉద్యమం కేవలం చట్టాల రద్దుకు మాత్రమే పరిమితం కాలేదు. అది శ్రమపెట్టుబడి మధ్య జరుగుతున్న నూతన పోరాటాన్ని సూచించింది. కనీస మద్దతు ధర (ఎంఎస్ పీ) కోసం పోరాటం అంటేతన శ్రమకు సరైన విలువను కోరడం అని అర్థం. ఈ పోరాటంలో వివిధ కులాలప్రాంతాల రైతులు ఐక్యమవ్వడం భారత విప్లవోద్యమాలకు ఒక కొత్త పాఠాన్ని నేర్పింది.

భారతదేశంలో సంప్రదాయ పరిశ్రమలతో పాటుగా, ‘డిజిటల్ క్యాపిటలిజం’ లేదా ప్లాట్ ఫామ్ క్యాపిటలిజం’ వేగంగా విస్తరిస్తున్నది. స్విగ్గీజొమాటోఓలా వంటి కంపెనీలు సృష్టిస్తున్న గిగ్ ఎకానమీ’ లో పనిచేస్తున్న కోట్లాది మంది శ్రామికులు నేడు ఒక కొత్త రకమైన దోపిడీకి గురవుతున్నారు. ఇక్కడ దోపిడీ నేరుగా యజమాని ద్వారా కాకుండా, ‘అల్గారిథమ్’ ద్వారా జరుగుతున్నది. మార్క్స్ వివరించిన పరాయీకరణ’ సిద్ధాంతం డిజిటల్ యుగంలో మరింత కఠినంగా మారుతున్నది. గిగ్ వర్కర్లకు తమ పనిపై ఎలాంటి నియంత్రణ ఉండదు. రేటింగ్స్ఇన్సెంటివ్స్పెనాల్టీల ద్వారా వారిని నిరంతరం పని చేసేలా యంత్రాలు ప్రేరేపిస్తుంటాయి. కార్మికుడు తాను ఏ ఆర్డర్ తీసుకోవాలోఏ మార్గంలో వెళ్లాలో అల్గారిథమ్ నిర్ణయిస్తుంది. దీంతో పని నుంచి పరాయీకరణ జరుగుతున్నది. రేటింగ్స్ ఆధారంగా పోటీని పెంచడం ద్వారా కార్మికుల మధ్య సంఘీభావం దెబ్బతింటుంది. నిరంతర పర్యవేక్షణతీవ్రమైన పని ఒత్తిడి వల్ల కార్మికుడిలో మానసిక ఆందోళన పెరుగుతుంది.  గిగ్ ఎకానమీలో శ్రామిక శక్తి క్రమక్రమంగా వృద్ధి చెంది 2030 నాటికి 2.35 కోట్ల మందికి చేరువ కానున్నది. ఇది భారతదేశపు అతిపెద్ద శ్రామిక సమూహంగా మారుతున్నది.  భారతదేశంలో నేడు ఆరోగ్య రంగం లాభార్జన’ కేంద్రంగా మారిపోయింది. భారత ఆరోగ్య వ్యవస్థలో 60 శాతానికి పైగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నది. మందుల ధరలు పెరగడంఅనవసరమైన టెస్టులు చేయడం,నకిలీ మందుల మాఫియా అంతా ఈ పెట్టుబడిదారీ దోపిడీలో భాగమే. ఇక నాణ్యమైన విద్య కేవలం ధనికులకే పరిమితం కావడంకార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల రూపంలో దోపిడీ చేయడం వల్ల పేద పిల్లలు శ్రామికులుగా మిగిలిపోతున్నారు.

మావోయిస్టులు భారతదేశాన్ని ఇంకా అర్ధ వలసఅర్ధ భూస్వామ్యంగా నిర్వచించడంమారిపోయిన భౌతిక పరిస్థితులను గుర్తించకపోవడమే ఈ వైఫల్యానికి ప్రధాన కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు.  భారతదేశంలో ఒక పార్లమెంటరీ వ్యవస్థ లోపభూయిష్టమైనా ప్రజలకు వోటు హక్కుకొన్ని చట్టపరమైన అవకాశాలు కల్పిస్తున్నది. దీనిని మావోయిస్టులు పూర్తిగా విస్మరించడం వల్ల సామాన్య ప్రజలకు దగ్గర కాలేకపోతున్నారు.  ప్రభుత్వం ఒకవైపు ఉద్యమాన్ని అణచివేస్తూనేమరోవైపు మౌలిక సదుపాయాల కల్పన పేరుతో ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా యువత ఇప్పుడు చదువుకోవడంనగరాలకు వలస వెళ్లడం వల్ల పాత రకం గెరిల్లా పోరాటాలకు’ ఆకర్షితులయ్యే వారి సంఖ్య తగ్గుతున్నది. మావోయిస్టులు చెప్పే దీర్ఘకాలిక ప్రజాయుద్ధం’ (ప్రొటెక్టెడ్ పీపుల్స్ వార్) వ్యూహం నేటి డిజిటల్ యుగంలో  ఎంతవరకు సాధ్యమనేది పెద్ద ప్రశ్న.

ప్రస్తుత భారత సామాజికఆర్థిక పరిస్థితులను బట్టిఒక నూతన విప్లవాత్మక పోరాటం సమాజంలోని అన్ని వర్గాల వైరుధ్యాలను సమన్వయం చేసుకుంటూ సాగాలి. నేటి డిజిటల్ పోరాటం  డిజిటల్ స్పేస్ లో కూడా జరగాలి. గిగ్ వర్కర్లుఐటీ ఉద్యోగులుసంప్రదాయ కార్మికులు కలిసి ఒకే వేదికపైకి రావాలి. అల్గారిథమిక్ దోపిడీకి వ్యతిరేకంగా , ‘డేటా’ అనేది ప్రజల ఆస్తి అనిదాని ద్వారా వచ్చే లాభం శ్రామికుడికి దక్కాలని డిమాండ్ చేయాలి. రైతుల పోరాటం వినియోగదారుల (నగర ప్రజల) పోరాటంతో కలవాలి. శాస్త్రీయ దృక్పథం లేని విప్లవం కేవలం భావోద్వేగంగా మిగిలిపోతుంది. “పోరాట రూపం మారవచ్చుకానీ పోరాటపు సారం మారజాలదు” అనే నిజాన్ని ప్రజలకు వివరించాలి. మార్క్సిజం చెప్పే మార్పు అనేది గాలిలో నుంచి వచ్చేది కాదు. అది సమాజంలో పెరుగుతున్న వైరుధ్యాల నుంచి పుడుతుంది.  విప్లవకారులు తమ వ్యూహాలను పాత పుస్తకాల నుంచి కాకుండానేటి వీధుల నుంచిస్మార్ట్ ఫోన్ల నుంచిఅప్పుల పాలైన రైతుల కండ్లలో నుంచి రూపొందించుకోవాలి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.  నేటి భారత సామాజిక పరిస్థితుల్లో మార్క్సిజం ప్రాతిపదికన ఒక బలమైనశాస్త్రీయమైన,  సమగ్రమైన విప్లవ శక్తిని నిర్మించే మార్పు ప్రజలే  తీసుకురావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *