భారత జనాభాలో యువశక్తి అధికం. చలనశీలత, పట్టణీకరణ ప్రధానంగా ఒత్తిడికి కారణమవుతున్నప్పటికీ, మార్పునకు దోహదకారులుగా ఉంటున్నాయి. పురాతన ఆర్థిక వ్యవస్థలకు మాదిరిగా లోతైన మౌలిక సదుపాయాల కల్పనకు భిన్నంగా నేడు భారత్ కర్బన ఉద్గార రహిత పారిశ్రామిక అభివృద్ధిని సాధించగలదు. అంటే మరింత స్వచ్ఛతతో కూడిన సమర్థవంతమైన వ్యవస్థలు, కనిష్ట కర్బన ఉద్గారాలు కలిగిన నగరాలు, స్థితిస్థాపకత కలిగిన వ్యవసాయం, నైపుణ్య పర్యావరణ మిత్ర శ్రామికులు మనదేశాన్నిమరింత స్వచ్ఛతవైపునకు తీసుకెళ్లగలరు. ఇదే సమయంలో వర్షపాతంతో సంబంధం లేకుండా ప్రకృతిపరంగా వేడి గాడ్పులు వంటివి అత్యంత తరచుగా ఏర్పడుతుండటం మరో ప్రతికూలత. వీటి బారిన పడుతుండటం వాస్తవమే. ఈ నేపథ్యంలో ఇంధన పరంగా (పర్యావరణ మిత్ర) నవకల్పనలు కూడా అవసరం. మనదేశంలో వాతావరణ సమస్యలకు నిజమైన పరిష్కారం కేవలం బోర్డ్ రూమ్‌ల్లో కాదు, సమాజాలనుంచే సాధ్యమన్న సంగతి గుర్తించాలి. ఈ సమాజాలే మార్పునకు ముందంజలో ఉంటాయి.
జులై 11 ప్రపంచ జనాభా దినోత్సవం. నిరంతర జనాభా పెరుగుదల భూమికి అంత శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా విచ్చలవిడిగా కర్బన ఉద్గారాల విడుదల, కాలుష్యం పెరగడంతో వాయునాణ్యత పడిపోవడం, వనరుల విచ్చలవిడి వినియోగం వంటి కారణాల నేపథ్యంలో వాతావరణ పరిరక్షణకు నిజమైన పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? అంటే స్పష్టమైన సమాధానం లేదు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం కావడంతో ప్రధానంగా రెండు సమస్యలు ఎదుర్కొనాల్సి వొస్తున్నది. మొదటిది పర్యావరణ పరమైన సమస్య కాగా రెండవది జనాభా పరమైనది. అయితే ఇది చూడటానికి పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నప్పటికీ వ్యూహాత్మక సానుకూలతకు దారితీస్తుందా? అనేది చూడాలి. ఇంతటి జనాభాలో ఎంతమంది భారత్ భవిష్యత్తును తీర్చిదిద్దుతారో, ప్రపంచ పర్యావరణ సమస్యకు ఉత్తమ పరిష్కారాన్ని చూపుతారో తెలియకుండా, ఇంతగా పెరిగిన జనాభావల్ల ఏంటి ప్రయోజనమన్నది సహజంగానే ఉదయించే ప్రశ్న.
ప్రపంచ వ్యాప్తంగా జనాభా పోకడలను పరిశీలిస్తే తీవ్ర అసమానతలు కనిపిస్తాయి. చైనా, జపాన్ మరియు కొన్ని యూరప్ దేశాలు జనాభా తగ్గిపోవడం, వృద్ధుల జనాభా పెరిగిపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నాయి. ముఖ్యంగా ఈ దేశాల్లో జననాల రేటు దారుణంగా పడిపోతున్నది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పిల్లల్ని కనమంటూ ఆయా దేశాల ప్రభుత్వాలు పౌరులను ప్రోత్సహిస్తున్నాయి. మరి ఇదే సమయంలో కొన్నిదేశాల్లో పెద్ద కుటుంబాలు, లైంగిక ఆరోగ్య వసతులు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు తాండవిస్తున్నాయి. ఇక్కడ సమస్య కేవలం ప్రజలది మాత్రమే కాదు, జన్మనివ్వడంలో ఒక ప్రణాళికాబద్ధత లేకపోవడం, సామాజిక నియమాలు, విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్వాతంత్య్రం, భౌతిక పరమైన అందుబాటు, కుటుంబ నియంత్రణ అందుబాటులో ఉండటం వంటివి కూడా కీలకపాత్ర పోషిస్తాయి.
అందువల్ల జనాభా అనేది ఇప్పటికీ సరిగ్గా పరిష్కారానికి నోచని సమస్యగానే ఉండిపోయింది. ఈ విషయంలో కొన్ని గళాలు కఠినంగా ఉన్నప్పటికీ, సంక్షేమం, సమానత్వం, సుస్థిరత అనేవి ఒకదానితో మరొకటి అంతర్గతంగా అల్లుకుపోయిన సమస్యలు. సరిగ్గా ఇక్కడే మనదేశ పరిమాణం, జనాభా అనేవి లెక్కలోకి వొస్తున్నాయి. 1.4 బిలియన్ జనాభా నిజంగా ఒక సవాలువంటిదే. ఇదే సమయంలో దేశ పరిమాణం కూడా ఒక శక్తివంతమైన ఉపకరణం కూడా. పర్యావరణ సమస్యలకు తక్కువ ఖర్చుతో పరిష్కారం చూపగలదు.
చిన్న దేశాలకు ఇది సాధ్యంకాదు. విద్యుత్ పంపిణీ, పునరుత్పాదక వనరుల పంపిణీ, పర్యావరణ మిత్ర వ్యవసాయం వంటి అంశాల్లో భారత్ తన హక్కును సక్రమంగా వినియోగించుకో గలిగితే, ప్రపంచ ఆర్థిక వనరులను, గతిశీలతను మరియు అంచనాలను సమూలంగా మార్చివేయగలదు. ప్రస్తుతం ఇది జరుగుతున్నది కూడా. ప్రస్తుతం దేశం సౌర సాగువ్యవస్థ, ఇంధన సామర్థ్యం కలిగిన లైట్ల వినియోగం, విద్యుత్ ద్విచక్ర మరియు త్రిచక్రవాహనాలు వంటివివి ఇందుకు ఉదాహరణ. మరి ప్రయోజనాలు, విజయాలు కేవలం జనాభావల్ల సాధ్యమయ్యేవి కావు.
భారత జనాభాలో యువశక్తి అధికం. చలనశీలత, పట్టణీకరణ ప్రధానంగా ఒత్తిడికి కారణమవుతున్నప్పటికీ, మార్పునకు దోహదకారులుగా ఉంటున్నాయి. పురాతన ఆర్థిక వ్యవస్థలకు మాదిరిగా లోతైన మౌలిక సదుపాయాల కల్పనకు భిన్నంగా నేడు భారత్ కర్బన ఉద్గార రహిత పారిశ్రామిక అభివృద్ధిని సాధించగలదు. అంటే మరింత స్వచ్ఛతతో కూడిన సమర్థవంతమైన వ్యవస్థలు, కనిష్ట కర్బన ఉద్గారాలు కలిగిన నగరాలు, స్థితిస్థాపకత కలిగిన వ్యవసాయం, నైపుణ్య పర్యావరణ మిత్ర శ్రామికులు మనదేశాన్నిమరింత స్వచ్ఛతవైపునకు తీసుకెళ్లగలరు. ఇదే సమయంలో వర్షపాతంతో సంబంధం లేకుండా ప్రకృతిపరంగా వేడి గాడ్పులు వంటివి అత్యంత తరచుగా ఏర్పడుతుండటం మరో ప్రతికూలత. వీటి బారిన పడుతుండటం వాస్తవమే. ఈ నేపథ్యంలో ఇంధన పరంగా (పర్యావరణ మిత్ర) నవకల్పనలు కూడా అవసరం. మనదేశంలో వాతావరణ సమస్యలకు నిజమైన పరిష్కారం కేవలం బోర్డ్ రూమ్‌ల్లో కాదు, సమాజాలనుంచే సాధ్యమన్న సంగతి గుర్తించాలి. ఈ సమాజాలే మార్పునకు ముందంజలో ఉంటాయి.
మనదేశంలో సహజవనరులు పుష్కలం. అందువల్ల మనందరికీ అవసరమైన ఆహారాన్ని పునరుత్పాదక వనరులనుంచి ఉత్పత్తి చేయాలి. వనరుల మరియు ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలి. ఇవి వాతావరణంపై తక్కువ ప్రభావాన్ని కలిగించేవిగా, అధిక ఉత్పత్తి సాధించేందుకు అనువుగా ఉండాలి. కర్బన ఉద్గారాగాలను తగ్గించే సాంకేతిక పరిజ్ఞానాలను నిర్మాణరంగంలో ఉపయోగించాలి. ఫలితంగా మార్కెట్ పరిమాణానికి అనుగుణంగా వాణిజ్యపరమైన పరిష్కారాలు చూపగలగాలి. దీనివల్ల వాతావరణాన్ని కాపాడటానికి చేపట్టే చర్యలకు అయ్యే ఖర్చు కూడా చాలావరకు తగ్గుతుంది. ఇది మనకు మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ప్రయోజకరం. వీటన్నింటిని పరిశీలిస్తే జనాభా పెరుగుదలపై మనం ఒక ఏవిధమైన వివక్షాపూరితమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేం. ఎందుకంటే జనాభాయే మన బలం మరియు బలహీనత కూడా! జనాభాను వాతావరణానికి అనుకూలమైన ఆస్తిగా మలచుకోవాలి. ఎట్లా అంటే విద్య, ఆరోగ్య పరిరక్షణ, కనిష్ట కర్బన ఉద్గారాలు విడుదల చేసే మౌలిక సదుపాయాలు మరియు ఇందుకు అనుగుణమైన విధానాల రూపకల్ప ద్వారా ఈ పని సాధించవచ్చు.
భారత జనాభా ఒకే రకమైన వాతావరణంలో మనుగడ సాగించడంలేదు. వాతావరణ పరమైన కష్టనష్టాలు, దీనికి అలవాటు పడే సామర్థ్యం వంటివి దేశంలోని వివిధ మానవ సమాజాల్లో భిన్నంగా ఉంటోంది. అందువల్ల మనం దేశం కోసం పనిచేస్తున్నామంటే, దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరికోసం పనిచేస్తున్నామని అర్థం. వాతావరణపరమైన వ్యూహాలు, అసమానతలను పట్టించుకోవు. ఒకవేళ అట్లా పట్టించుకోవడంవల్ల ఏవిధమైన ప్రయోజనమూ ఉండదు.ఈ నేపథ్యంలో ముందుగా ప్రధానంగా అంచనా వేయాల్సింది, ఏ మానవ సమాజాలు వాతావరణ మార్పులకు తేలిగ్గా లోనవుతున్నా యన్న అంశాన్ని! ఇదే వాతావరణ వ్యూహాన్ని అమలు చేయడానికి అత్యంత కీలకం! అప్పుడు మాత్రమే మన దేశంలోని జనాభాను మార్పు దిశగా ముందుకు నడిపించవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ విషయానికి వొస్తే మిలియన్ల కొద్దీ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు అవసరమైన సుస్థిరమైన నవకల్పనలు అవసరం. మిలియన్ల సంఖ్యలో పౌరులు వీటిల్లో ఉపాధి పొందుతున్నారు కనుక ఈ రంగాన్ని ఎట్టిపరిస్థితుల్లో నిర్ల్యక్ష్యం చేయడం సాధ్యంకాదు.
జనాభా గతిశీలత చాలా నిదానంగా ఉన్నప్పటికీ దీనివల్ల కలిగే ఫలితాలు దీర్ఘకాలికం! ఇవి సంప్రదాయ ప్రణాళికలను దీర్ఘకాలం మనగలిగేలా చేస్తాయి. అందువల్ల ఇందుకు అనుగుణమైన ప్రణాళికలు రూపొందించడం తక్షణావసరం. ఇప్పుడు 1.4బిలియన్లకంటే ఎక్కువ జనాభాను ఒక సంక్షోభంగా పరిగణించి ఈ పెరుగుదలను నిరోధించాలనుకుంటే అది సంకుచిత మనస్తత్వాన్ని సూచిస్తుంది. అదే ఈ అత్యధిక జనాభాను పర్యావరణ పరిరక్షణకు ఒక పెద్ద వేదికగా భావించినట్లయితే, వాతావరణ ప్రభావా నికి లోనయ్యే దశనుంచి, పర్యావరణ పరంగా నాయకత్వం వహించే స్థాయికి తీసుకెళ్లగలదు.





