12. జనధర్మోవిజయతే
ప్రారంభ సంచికల్లో ‘పాలసీ’ ప్రకటన చేయబడిరది. వరంగల్ వాణి దినపత్రిక తొలి సంచికలో చెప్పినట్లు, దిన పత్రిక ఒక అనివార్యమైన అవసరమని, అది నగరానికి గర్వకారణమని భావించే ‘శీలమే’ ఈ పత్రిక ఊపిరి. ఇది ఉపరితలావ లోకనంలో కేవలం ‘గాలిలో దీపం పెట్టి దేవుడా’ అని మొక్కినట్టు కనబడ్డా, స్థానిక ప్రజల మనోభావ విశ్లేషణ, మానసిక వ్యవస్థ ఎట్లాంటిదో, దానికి తమ రచనలు ఎట్లాంటి అనుసంధానాలో, ఉభయుల ఉనికికి ఎట్లాంటి ఆలంబనో, ఒక నిర్దుష్టమయిన అవగాహన లేకుండా ఆ మాటలు రాసారని అనగలగడం విశ్లేషణకు ఎలా సాధ్యమవు తుంది? ‘ఆరంభం: అనుభవం’ ఈ అంశాలను స్పష్టపరుస్తుంది. పాకిస్తాన్ పాలకులను గూర్చి ‘అసమర్థుని దుర్మద విజృంభణ వంటివి, మార్పుల్ని స్వాగతించే ‘స్వాగతం’, ‘షేకుగారి మేకుతనం’ ప్రబలుతున్న ‘ఇసుక తక్కెడ’ రాజకీయ ధోరణులు ‘కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం భ్రమ’ రూపకల్పనేగాని పని లేని ప్రాంతీయ సంఘాల ‘అజాగళస్తనం’, వైనంబీ ఎన్.టి.రామారావు అధికారానికి రావటానికి వెనుక ఇందిరగాలి.
ఎన్టీఆర్ గాలి తీవ్రతలకన్నా మార్పురావాలనే కోరిక ‘సుడిగాలి’గా కనబడటం మొదలయినవి ‘విశ్వం : భ్రమణం’లో చేరగా, వ్యక్తులు, వారి స్మృతులు – లోతైన అనుభూతులు ‘వ్యక్తి : వ్యక్తిత్వంలో చోటు చేసుకొన్నాయి. ప్రాంతీయ ప్రజల ప్రగతిని అనుక్షణం అద్దంలో చూపుతూ తాము ఊహించుకున్న రేఖా చిత్రాలకు ప్రాణం పోసి వాటి బింబ ప్రతిబింబాలను చూపుతూ, ఊపులకూ కుదింపులకూ నిలదొక్కుకుంటూ ‘తెలంగాణా’ అంటే తెలంగాణా ప్రజల సమగ్ర నికసన ధ్యేయంతో దీక్షతో రాసిన సంపాదకీయాలు ‘తెలంగాణా ఉద్యమం: ఉద్దీపనంలో సంకలితమయినాయి. సంస్కృతి-కళలకు సంబంధించినవి ‘సంస్కృత: సంప్రదాయం’. చిన్న పత్రికలు మనగల్గడం చాలా కష్టం. ఇతరేతర కారణాలవల్ల కొన్ని కొంత కొంతగా మనగల్గితే` మరికొన్ని త్వరత్వరగా గిట్టుకున్నాయి.
వాటి తీరుతెన్నులు – అదో పెద్ద గ్రంథం. కాని చిన్న పత్రికల ఉనికిని సవాలు చేసే వాణిజ్య ప్రవృత్తి గల పెద్ద పత్రికల నిర్లక్ష్యం, ప్రభుత్వ విధానాలు, ఇవన్నీ అట్లా ఉంచి ఆర్థికాది ఇబ్బందులు, నిర్వహణ సమస్యలు ఎన్నో ఉన్నా పెట్టుబడిదారీ పత్రికల కన్నా, ఎంతో విలువయిన, ప్రధానమయిన పేదలకు నిజమయిన ప్రజాస్వామ్య వ్యవస్థ పని చేసే అవకాశాలను విపులీకరించే సంపాదకీయాలు ‘పత్రికలు: ఇతరములు’ అన్న అధ్యాయం. కొన్ని ‘పత్రికల వారి ద్వంద్వ నీతి’ స్వరూపం గూడా ఇందులో అవగతమవుతుంది. కోట్లాది ప్రజల సమస్యలు ఎన్ననిః వాటి స్వరూప స్వభావాలు పరిష్కార విధానాలు నిరూపించే విధంగా ‘రైతుల నాదుకొనేదెవరు? ‘నిలద్రొక్కుకొంటున్న శేష ప్రశ్నలు’ మొదలయిన వాటిలో రైతుసమస్యలు, ‘అధోగతి కితార్కాణం’ చేనేత వ్యవస్థ సమన్యలు-కొత్తగూడెం థర్మల్ స్టేషన్, డబ్బిచ్చి కొరిగించుకొంటున్న బుర్రలు, విద్యుద్ఘాతాల వంటి విద్యుత్ సమస్యలు, నిరుద్యోగ నిర్మూలన, ‘శివ శివ ఇదేం తీరు’ వంటి వివిధ ప్రజా సమస్యలు మచ్చుకు ‘ప్రజలు సమస్యలు’ అన్న అధ్యాయంలో చేరినవి.
మనలో, మనతో కలిసి మెలిసి ఉండే ఒక వ్యక్తి, సరళుడు. సరసోక్తులావాడే, రాజీ పడని వ్యక్తిత్వానికి
మొత్తం మీద ఈ సంకలనం ప్రచురణ ఒక చిన్న ఆరంభ ప్రయత్నం మాత్రమే. దీని ద్వారా ప్రేరణ పొంది ఇంకా ఎన్నో ఉన్న శ్రీ ఆచార్య సంపాదకీయాల సంకలనాలు వెలువడేందుకు మార్గదర్శకంగా మాత్రమే ఇది ఉద్దేశింపబడిరది. మనలో, మనతో కలిసి మెలిసి ఉండే ఒక వ్యక్తి, మేధావి, సామాన్యంగా కన్పించే సరళుడు. సరసోక్తులాడే సరసుడు అయిన శ్రీ ఆచార్యగారి అంతఃస్వరూపానికి, రాజీ పడని వ్యక్తిత్వానికి, ఆయన పత్రికా రచనలో పాటించిన ఉన్నత ప్రమాణాలకు, ఆత్మీయతకు అద్దం పట్టే విధంగా ఈ సంకలనం రూపొందించామనుకొంటున్నాం. పాఠకులకు మా కృషి అనుభవానికివస్తే మాప్రయత్నం సఫలమయినట్లు మాకు తృప్తి.
చివరకు` శ్రీ ఆచార్య సత్కార బృహత్కార్యంలో ఎందరో ఎన్ని విధాలుగానో సహకరించారు. వారికీ, జనధర్మ వరంగల్ వాణి పత్రికా సంపుటాలను మాకు అనువుగా అందించి సహకరించిన శ్రీ ఆచార్యగారికీ, స్వల్పకాలంలో ఈ గ్రంథాన్ని అందంగా ముద్రించి మా శ్రమకు ముద్రణ రూపమిచ్చిన వేంకటరమణ బుక్ ప్రింటర్స్ నిర్వాహకులకూ, పనివారికీ మా కృతజ్ఞతలు. ఈ సంకలన కార్యక్రమాన్ని మాకు అప్పగించి మా అధ్యయన శీలానికి మహదవకాశం కలిగించిన అభినందన సమితికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటూ సంపాదక మండలి వివరించింది.





