హైడ్రా దూకుడు మళ్లీ మొదలు

అల్కాపురి టౌన్‌షిప్‌లో అక్రమ షట్టర్లు నేలమట్టం
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19: అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మణికొండ మున్సిపాలిటీలో దూకుడు పెంచింది. హైదరాబాద్‌ మణికొండలోని అల్కాపురి టౌన్‌షిప్‌లో హైడ్రా చర్యలు చేపట్టింది. మార్నింగ్‌ రాగా అపార్టుమెంట్‌లో నిబంధనలకు విరుద్ధంగా షట్టర్లు వేసి దుకాణాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు షట్టర్లను తొలగించారు. దీంతో హైడ్రా, పోలీసులను మార్నింగ్‌ రాగా అపార్టుమెంట్‌ వాసులు అడ్డుకున్నారు. గత నెల 27న మణికొండ మున్సిపల్‌ అధికారులు ఇక్కడి వారికి నోటీసులు ఇచ్చారు. 7 రోజుల్లో షట్టర్లు తొలగించాలని అందులో పేర్కొన్నారు. నోటీసులకు స్పందించక పోవడంతో తాజాగా గురువారం షట్టర్లను తొలగించారు. ఇందుకు హైడ్రా సాయం తీసుకున్నారు. అల్కాపురి కాలనీ లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కమర్షియల్‌ షెట్టర్స్‌ ను అధికారులు తొలగించారు . రెసిడెన్షియల్‌గా అనుమతులు తీసుకుని కమర్షియల్‌గా వ్యాపార సముదాయాలు నడిపిస్తున్నట్లు ఫిర్యాదులు వొచ్చాయి.

దీంతో గత వారం హైడ్రా కమిషనర్‌ రంగనాథన్‌ అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన అదేశాల మేరకు అక్రమంగా నడుస్తున్న వ్యాపార సముదాయాలను గురువారం తొలగించారు. ఈ క్రమంలో అధికారులకు వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మణికొండ మునిసిపాలిటీకి లక్షల రూపాయలు కమర్షియల్‌ ట్యాక్స్‌ చెల్లించామని, ఎలా కూల్చివేస్తారంటూ వ్యాపారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ బాడా వ్యక్తి ఒత్తిడి మేరకు కూల్చివేతలు చేశారంటూ వ్యాపారుల ఆందోళన చేపట్టారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారంటూ వ్యాపారులు మండిపడ్డారు. అల్కాపురి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అధికారులు కమర్షియల్‌ షెట్టర్స్‌ తొలగింపుపై హైడ్రా కమిషనర్‌ రంగనాథన్‌ స్పందించారు… వ్యాపారస్తులు హైడ్రా కమిషనర్‌పై చేస్తున్న వాఖ్యలను ఖండిరచారు. పనికి మాలిన మాటలను వాస్తవాలు చేసే యత్నం చేస్తున్నారని, వీటన్నింటి వెనుక స్థానిక బిల్డర్‌ ఉన్నారని అన్నారు. మేము వివరంగా పత్రికా ప్రకటనను విడుదల చేస్తామని రంగనాథ్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *