హైదరాబాద్, ప్రజాతంత్ర, మే
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని, దాన్ని తిరిగి గాడిలో పెట్టి అందరికి నాణ్యమైన విద్యను అందించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి అప్పుడూ… ఇప్పుడూ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కృషి చేసిందన్నారు. మన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు 1991 – 1992 లోనే అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓ వైపు సర్కార్ బడులను బలోపేతం చేస్తూనే… మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థల ఏర్పాటును ప్రోత్సహించిందన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా సర్కార్ బడులను తీర్చి దిద్దేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు.
తెలంగాణ యువత ప్రతిభే మనకు పెద్ద ఆస్తి అని, అందుకే ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు మన దగ్గర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయన్నారు. రాష్ట్
నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులుగా తీర్చి దిద్దాలని, అందుకోసం “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ“తో భాగస్వామ్యం కావాలని కోరారు. ఉన్నత విద్యపై తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న టీవీ 9 యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఇలాంటి సదస్సులను గ్రామీణ ప్రాంతాల్లోనూ నిర్వహించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలాకృష్ణా రెడ్డి, పలు ప్రైవేట్ విద్యా సంస్థలు, టీవీ 9, క్యాబ్ కన్సల్టెంట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.





