– ఇంద్రాదేవికి మెస్రం వంశీయుల పూజలు
అదిలాబాద్. జనవరి 14: అదిలాబాద్ జిల్లా ఇందవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరలో భాగంగా ఇంద్రాదేవికి మెస్రం వంశీయులు పూజలు నిర్వహించారు. మహాపూజకు అవసరమైన పవిత్ర గంగాజలాన్ని జన్నారం మండలంలోని హస్తిన మడుగు నుంచి తెస్తున్నమెస్రం వంశీయులు బుధవారం ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు. సంప్రదాయ వాయిద్యా మధ్య వచ్చి ఆలయం ఎదుట ఉన్న మర్రి చెట్టుపై గంగాజలం భద్ర పరిచారు ఇంద్రాదేవికి పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం కే పూర్ కు బయల్దేరి వెళ్లారు. అక్కడి మర్రి చెట్లపై గంగా జలాన్ని ఉంచి జనవ 28 మహా పూజ రోజున ప్రత్యేకంగా నాగోబాకు అభిషేకాలు చేస్తారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





