- సమాజం మార్పు గురువుల చేతుల్లోనే ఉంది
- నవ సమాజ నిర్మాత గురువు మాత్రమే
కలుషితమైన మానవ విలువలను రూపుమాపి కల్మషం లేని మనస్సును సృష్టించి , కుల మతాల సుడిగుండాలకు బలి కాకుండా, విచ్చిన్నం అయినా సమాజాన్ని చక్కదిద్ది ఐకమత్యం ఏర్పరిచి, అసమానత్వం నుండి సమానత్వం దాక, బంధీలైన బంధాలకు స్వేచ్ఛను కల్పించి, కళ్ళు మూసుకొని ఉన్న అన్యాయాల నుండి న్యాయాన్ని తెరిచి, అమానవీయా ఘటనల నుండి మానవత్వం వైపు నడిపించడానికి తనలోని జ్ఞానాన్ని అక్షర రూపంతో రగిల్చి విప్లవాత్మక మార్పులు తెచ్చేవాడు,నవ సమాజ నిర్మాత గురువు, ఇలాంటి గురువులల్లో సర్వేపల్లి రాధాక్రిష్ణ, సావిత్రి బాయి పూలె, జ్యోతిరావు పూలె, కబీర్ దాస్, ఫాతిమా షేక్, రవీంద్రనాథ్ ఠాగూర్, మదన్మోహన్ మాళవియ, డా. అబ్దుల్ కలాం లాంటి వారేందరో…!
” దేశ అభివృద్ధి, సమాజ నిర్మాణం, విధ్యార్థుల భవిష్యత్,మానవ విలువలు, మూర్తిమత్వం, మానవత్వం, సామాజిక స్పృహ, ఓర్పు, నేర్పు, అన్నిటికి మూలం గురువు,ఏ దేశమైనా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే ఆ దేశ మానవ వనరులను తయారు చేసేది ఒక ఉపాధ్యాయుడే, అంటే దేశ అభివృద్ధికి కారకుడు గరువు మాత్రమే” ఇలా చెప్పుకుంటూ పొతే గురువుకున్న గుణాలను రాస్తుంటే ఎన్ని పేజీలు నింపినా తక్కువే అనిపిస్తుంది.!
గురువులకే గురువు డా॥సర్వేపల్లి రాధాకృస్ణన్ గారి పుట్టినరోజు సంధర్బంగా నేడు జరుపుకొనే ఉపాధ్యాయ దినోత్సవం ఒక ఉపాధ్యాయుని జ్ఞానానికి, త్యాగానికి ప్రతిఫలంగా డా॥సర్వేపల్లి గారు తన జన్మదినాన్ని అంకితం చేసిన రోజు, డా॥రాధాకృష్ణన్ గారు దాదాపు 40 ఏళ్ళ పాటు ఉపాధ్యయ వృత్తి చేపట్టారు, ఎన్నో సన్మానాలు, ఎన్నో అవార్డులు పొందారు, 27 సార్లు నోబెల్ పురస్కారానికి నామినేట్ అయ్యారు, దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న పొందారు, దేశ ప్రథమ ఉపరాష్ట్రప్రతిగా, బాబు రాజేంద్రప్రసాద్ తర్వాత రెండవ రాష్ట్రప్రతిగా ఎన్నొకోవడానికి ప్రధాన కారణం, ఆయన సాధించిన అవార్డులు పేరు ప్రఖ్యాతులకు అన్నిటికీ ప్రధాన కారణం డా॥సర్వేపల్లి గారు విద్య మరియు విద్యా రంగానికి చేసిన సేవలే, ఆయన చేపట్టిన ఉపాధ్యాయ వృత్తి వలనే ఆయనకు దేశ అత్యున్నత పదవులు వరించాయి.
ఒక టీచర్ నవ సమాజ నిర్మాతగా విద్యార్థులందరినీ కల, మత భేదం లేకుండా ముందుకు నడిపించే గురువుగా ఉండాలని బోధించారు, అందుకే భగవద్గీతను చదివినంత శ్రద్ధాసక్తులతో బైబిల్ చదివారు సర్వేపల్లి గారు, ఖురాన్ ను అలవోకగా నేర్చుకున్నారు, సూఫీ తత్వాన్నీ మధించారు, విశ్వ గురువుగా పేరొందిన సర్వేపల్లి గారికి కొందరు విద్యార్థులు ఆయనకు పుట్టినరోజు సంధర్బంగా శుభాకాంక్షలు తెలిపితే, జన్మదినం కాకుండా ఉపాధ్యాయ దినంగా మలిచిన గొప్ప వ్యక్తి, చరిత్ర మరువని గొప్ప పండితున్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం కేవలం ఉపాధ్యాయులదే కాదు, జ్ఞానాన్ని పొందిన ప్రతి పౌరునిది, ఇది దేశ ప్రజలందరిదీ.! గొప్ప స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు, అన్ని రంగాలలో స్థిరపడ్డ జ్ఞానవంతులు, విద్యావంతులు, చదువుకున్న మరియు చదువుతున్న ప్రతి పౌరుడు తన గురువులను స్మరించుకొనే రోజు.!
గురువు దైవంతో సమానం
గురు బ్రహ్మ, గురువిష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమహః అని దైవంతో సమానంగా కొలుస్తారు, పాఠశాల అనే దేవాలయంలో అతనే దైవం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని సమాజంలో తల్లి తండ్రుల తర్వాత స్థానం గురువులకే ఇస్తారు, ప్రఖ్యాత కవి కబీర్ దాస్ తన కవితల్లో గురువుపై ఉన్న తన భక్తి ఏకంగా భగవంతుని కన్న ఎక్కువ ప్రాధాన్యత గురువుకే ఇస్తారు, గురువూ గోవిందుడూ ఎదురైతే మొదట గురువుకే మొక్కాలంటారు. కేవలం విద్య నేర్పించడమే కాకుండా మంచి చెడుల జ్ఞానోదయం కలిగించేది, వినయ విధేయతలు నేర్పించేది, తల్లి తండ్రులు పెద్దల పట్ల గౌరవ మర్యాదలు చూపే విధంగా మంచిని బోధించేది, కష్ట కాలంలో నిలదొక్కుకునే విధంగా ధైర్యాన్ని నింపేది, సమాజ నిర్మాణంలో ప్రజా సేవ చేసే విధంగా రాజకీయాలను అవగాహన పర్చేది, ఉన్నత రంగాల్లో రానించేలాగా చేయడంలో, బాధ్యతలను, కర్తవ్యాలను, తెలివితేటలను, శక్తిని, యుక్తిని, శాంతిని, ధర్మాన్ని, తన దగ్గరున్న అపార అనుభవాన్ని నర నరాన నింపి శిలి శిల్పాన్ని చెక్కినట్లు విద్యార్థులలోని జ్ఞానాన్ని చెక్కుతూ రూపకల్పన చేసేదే కేవలం ఉపాధ్యాయుడే.!
సాంకేతికత ఎంత పెరిగినా, అర చేతిలో ప్రపంచం మొత్తం కనపడేలా ఫోన్లు, నెట్ వర్క్ లు ఉన్నా కూడా, నేటి 5జీ స్పీడ్ వెతకలేని కొన్ని విషయాలను తన విద్య ద్వారా తన ఇంద్రియ జ్ఞానం ద్వారా మేల్కొలిపే శక్తి టీచర్ వద్దనే ఉంది, ఈరోజుల్లో యువత విషయ శోధన కోసం, ఏదైనా తెలుసుకోవాలన్నా గూగుల్ లో కొట్టు, యూట్యూబ్ తల్లిని అడుగు అంటున్నారు, అంతర్జాలంలో అన్ని తెలుస్తాయనే భావనలో ఉన్నారు, ఆ గూగుల్ కే గురువైనా ఉపాధ్యాయుని మాత్రం గుర్తించడం లేదు, సాఫ్ట్ వేర్లు మొత్తం ప్రపంచం చేతిలో ఉన్నప్పటికీ దాని పాస్ వర్డ్ లు మాత్రం గురువు తన దగ్గరే ఉంచుకున్నాడు, జీవిత లక్ష్యాన్ని జీవితమంతా గుర్తుండెలా బోధించేది గురువు, ఒక విద్యార్థి తల్లి తండ్రుల కన్నా ఎక్కువ సమయం గడిపేది ఉపాద్యాయులతోనే, చీకటి నుండి వెళుతురు వైపు నడిపించి అజ్ఞాన తిమిరంలో విజ్ఞాన కాంతులు ప్రసరించేది టీచర్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి, గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు. విద్యార్థి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేవాడు, గురువులందరికి ఉపధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో..
సయ్యద్ జబీ (లెక్చరర్)
TGO (సెక్రటరీ-సిరిసిల్ల జిల్లా)
9949303079





