స్పీకర్ కోర్టులో మరో ఇద్దరి భవితవ్యం

– కడియం, దానంలపై తుది విచారణ
– 27, 28వ తేదీల్లో విచారణకు సిద్ధం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవ హారం కీలక దశకు చేరుకొన్నది. ఇప్పటికే 8 మంది విషయంలో స్పీకర్ స్పష్టమైన తీర్పును ఇచ్చారు. వీరు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తీర్పును ఇచ్చారు. ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారాన్ని తేల్చబోతున్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపేందుకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఈనెల 27, 28 తేదీల్లో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణకు తమ వాదనలను వినిపించడంతోపాటు సాక్ష్యాధారాలను సమర్పించాల్సి ఉంటుందని షెడ్యూల్ లో పేర్కొన్నారు. స్పీకర్ నేతృత్వం లోని ట్రిబ్యునల్ ఎదుట పిటిషనర్ల తరపు న్యాయవాదులు అడిగే ప్రశ్నలకు దానం, కడియం సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరలేదని నిరూపించుకోవడానికి అవసరమైన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. గత నెల 18న ఈ కేసులో పిటిషనర్ బీఆర్ఎస్ కి చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని దానం నాగేందర్ తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. 19న కడియం తరపు లాయర్లు వివేకానందగౌడ్ ను ప్రశ్నించారు. స్పీకర్ విచారణ షెడ్యూల్ ప్రకారం బీఆర్ఎస్ కి చెందిన కౌశిక్ రెడ్డి దా ఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 27న ఉదయం 11 గంటలకు విచారణ ఉంటుంది. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై మధ్యాహ్నం 12 గంటలకు విచారణ చేపడతారు. 28న ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఉంటుంది. ప్రతివాది స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తరఫున సాక్ష్యాధారాలను సేకరిస్తారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *