టీజీపీఎస్సీ వ్యవస్థలో లోపాలు బయటపడ్డాయి

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: గ్రూప్‌-1 పరీక్ష పత్రాల రీవాల్యుయేషన్‌ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. బుధవారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షల ప్రక్రియలో గందరగోళాలు, లెక్కలేనన్ని అవకతవకలు జరిగాయని కోర్టు తేల్చిందని, దీంతో టీజీపీఎస్సీ వ్యవస్థలోని లోపాలు బయట పడ్డాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి లక్షలాదిమంది విద్యార్థుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్‌ విడుదల నుంచి ప్రశ్నాపత్రాల మూల్యాంకనం వరకు టీజీపీఎస్సీ చాలా లోపాలతో కూడిన విధానాలను అవలంబించిందని ఆరోపించారు. లక్షలాదిమంది నిరుద్యోగ విద్యార్థులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూశారని, ఈ తీర్పు ద్వారా వారికి న్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనూ పేపర్‌ లీకేజీ ఘటనలతో వేలాదిమంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించచారు. అదే పరంపరను కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *