– ప్రభుత్వానికి టీజీహెచ్‌ఆర్‌సీ సిఫారసు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: ఖమ్మం గిరిజన సంక్షేమ వసతి గృహంలో చోటుచేసుకున్న పదేళ్ల విద్యార్థి దేవత్ జోసెఫ్ మరణం గిరిజన సంక్షేమ విభాగం అధికారుల తీవ్ర నిర్లక్ష్యం వల్ల జరిగినదని డా. జస్టిస్ షమీమ్ అక్తర్ నాయకత్వంలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) నిర్ధారించింది. బాలుడి తల్లి చెవిటి, మూగదనం కలిగి ఉండి, అప్పుడప్పుడే జీతం అందుకునే స్థితిలో, తన కుమార్తెతోపాటు వృద్ధ అత్తను పోషించాల్సిన బాధ్యతను నిర్వర్తిస్తున్న నేపథ్యంలో ఆమెకు ప్రభుత్వం నిబంధనలను సడలించి లాస్ట్ గ్రేడ్ కేటగిరీలో రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని, రూ.5లక్షల పరిహారం మంజూరు చేయాలని సిఫారసు చేసింది. ఇది మానవతా దృక్పథంతో, గౌరవం, మౌలిక హక్కులను కాపాడే చర్యగా పేర్కొంటూ కమిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సిఫారసులను ఆరు నెలల్లోగా అమలు చేసి అమలు నివేదికను కమిషన్‌కు సమర్పించాలని పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


