– టీజీహెచ్‌ఆర్‌సీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: స్టడీ సర్టిఫికెట్లను నిలిపివేయడం విద్యార్థుల రాజ్యాంగ, మానవ హక్కులను ఉల్లంఘించడమేనని తెలంగాణ మానవ హక్కుల సంఘం(టీజీహెచ్‌ఆర్‌సీ) చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్‌మెంట్ రావలసి ఉందనే కారణంతో తమ ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లు అక్రమంగా నిలిపివేస్తున్నారని వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, నల్గొండకు చెందిన తొమ్మిదిమంది బి.ఫార్మసీ విద్యార్థులు టీజీహెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేశారు. దీనిపై డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని టీజీహెచ్‌ఆర్‌సీ విచారణ చేపట్టింది. మానవ హక్కుల రక్షణ చట్టం 1993లోని సెక్షన్ 18(ష) కింద ఉన్న అధికారాలను వినియోగించి కళాశాల చైర్మన్, ప్రిన్సిపాల్‌లు విద్యార్థుల ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లు తక్షణమే తిరిగి ఇవ్వడమేకాక, టీసీలు జారీ చేయాలని కమిషన్ సిఫారసు చేసింది. కళాశాల యాజమాన్యం, అలాగే కళాశాల చైర్మన్, ప్రిన్సిపాల్‌లను వ్యక్తిగతంగా సెప్టెంబర్ 2వ తేదీన కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వుల ప్రతిని నల్గొండ జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర ఉన్నత విద్యామండలికి తక్షణ చర్య కోసం పంపించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.



