తెలంగాణ సివిల్ స‌ర్వీస్ అధికార్ల‌కు ఐఏఎస్‌లుగా ప్ర‌మోష‌న్‌

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 21:  రాష్ట్ర సివిల్ స‌ర్వీసుల‌కు చెందిన అధికార్ల‌ను ఇండియ‌న్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్ (ఐఏఎస్‌)కు ప్రొబెష‌న్ పై బ‌దిలీ చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి రాజేష్‌కుమార్ యాద‌వ్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆర్‌.డి.మాధురి, పి.బెన్ ష‌లోమ్‌లు తెలంగాణ హైకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్ మేర‌కు కోర్టు ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు వీరిని ప్ర‌మోష‌న్‌పై బ‌దిలీ చేస్తున్న‌ట్టు ఆయ‌న ఉత్తర్వుల లేఖ‌లో పేర్కొన్నారు. వీరంతా 2022, 2023, 2024 ఎంపిక జాబితాకు చెందిన‌వారు. వీరి ప్రొబెష‌న్ మ‌ళ్లీ ఉత్త‌ర్వులు జారీ అయ్యే వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని ఆయ‌న ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఆ త‌ర్వా త వీరికి తెలంగాణ కేడ‌ర్ ను కేటాయిస్తారు. ఈవిధంగా ఐఏఎస్ ప్రొబెష‌న్‌కు వెళ్లే వారిలో డి. మ‌ధుసూద‌న్ నాయ‌క్‌, ఎం.స‌త్య‌వాణి, జె. భ‌వానీశంక‌ర్‌, జి.లింగ‌య్య‌నాయ‌క్‌, ఎ.న‌ర‌సింహారెడ్డి, జి.వీరారెడ్డి, జి.వి.శ్యాంప్ర‌సాద్ లాల్‌, యు.ర‌ఘురామ్ శ‌ర్మ‌, పి.చంద్ర‌య్య‌, జి.ముకుందరెడ్డి, ఎ.భాస్క‌ర్‌రావు, వై.వి. గ‌ణేష్‌, అబ్దుల్ హ‌మీద్‌, బి.వెంక‌టేశ్వ‌ర్లు, ఎన్‌. ఖీమ్యానాయ‌క్‌, కె. గంగాధ‌ర్‌లు వున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *