హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలయింది. ఈనెల 15వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులు స్వీకరణకు తుది గడువు 29వ తేదీతో ముగియనుంది. జనవరి 3 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా.. 2025 ఏడాదికి సంబంధించి తొలి విడత టెట్ నోటిఫికేషన్ గత జూన్‌లో విడుదల చేశారు. ఇప్పటికే పరీక్షలు పూర్తి చేయగా.. జులై 22న ఫలితాలు సైతం వెల్లడించారు. తాజాగా రెండో విడత టెట్ నోటిఫికేషన్ గురువారం విడుదల చేశారు. ఇక ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు సైతం టెట్‌లో అర్హత సాధించాలంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగాల్లో కొనసాగాలంటే.. టీచర్లంతా ఈ టెట్ పాస్ కావాల్సి ఉంది. ఈ పరీక్షకు శుక్రవారం ( నోటిఫికేషన్ విడుదల చేస్తారు. శనివారం నుంచి నవంబర్ 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాల్సి ఉండగా.. ఈ ఏడాది జూన్‌లో తొలి విడత పరీక్షలు నిర్వహించి.. జులై 22న ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే. రెండో విడత టెట్‌కు శనివారం నుంచి దరఖాస్తుల పక్రియ మొదలుకానుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





