హైదరాబాద్, ఫిబ్రవరి 10 టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదల అయ్యాయి. అర్హత సాధిం చిన అభ్యర్థుల జాబితాను మంగళవారం పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. టెట్కు రాష్ట్రవ్యాప్తంగా 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందు లో 1,95,181 (82.09 శాతం) మంది హాజరయ్యారు. సుమారు 42.573 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ పరీక్షల్లో ఇన్-సర్వీస్ టీచర్లు అత్యధికంగా 90.27 శాతం మంది హాజరైనట్లు తెలుస్తోంది. జనవరి 3 నుంచి 20 వరకు పరీక్షలు కొనసాగాయి. టెట్ ఫలితాలు ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్య విడుదలయ్యే అవకాశం ఉందని ముందుగానే అధికారులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




