మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క
హైదరాబాద్, జూన్ 10: రాష్ట్రవ్యాప్తంగా 38 ఆసుపత్రుల్లో సదరం సర్టిఫికెట్ల జారీ కోసం అంగవైకల్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పంచాయతీరాజ్ గ్రావిూణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఇందుకోసం ఒక్కో ఆసుపత్రికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.3.8 కోట్లను విడుదల చేశామని తెలిపారు. సదరం సర్టిఫికెట్ల జారీలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన కారణంగా అర్హులు చాలామంది నష్టపోjరూ.ూరని తెలిపారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఈ ధ్రువీకరణ పత్రాల కోసం వైకల్య గుర్తింపుపై డాక్టర్లకు మంగళవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలోనుంచుకుని దివ్యాంగుల్లో వైకల్యాన్ని గుర్తించేందుకు డాక్టర్లకు రాష్ట్ర చరిత్రలో మొదటిసారి వర్క్‌షాపును నిర్వహిస్తున్నామన్నారు. ఎలాంటి వైకల్యం ఉంది, ఎంత శాతం మేర ఉందనే అంశాన్ని డాక్టర్లు పక్కాగా గుర్తించి సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని సూచించారు. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ ఇవ్వకపోతే వారికి తీవ్ర అన్యాయం చేసినట్టవుతుందని అన్నారు. ఈ సర్టిఫికెట్ల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. చేయూత పెన్షన్, ఉద్యోగ ఉపాధి రంగాల్లో రిజర్వేషన్, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, స్వయం ఉపాధి పథకాలకు సదరం సర్టిఫికెట్ ఆధారంగానే ఎంపిక జరుగుతుందని వివరించారు. దివ్యాంగులకు ఆత్మగౌరవం దక్కాలంటే డాక్టర్లు పక్కాగా పరీక్షలు నిర్వహించి సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, సదరం డైరెక్టర్ సాయి కిషోర్, న్యూ ఢల్లీి ఎయిమ్స్, గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లోని పలు విభాగాధిపతులు, స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొన్నారు.




