పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు

– కొవిడ్ తరహా సంక్షోభం
– అఖిలపక్షంతో ప్రభుత్వం రేపు భేటీ?

న్యూదిల్లీ, మార్చి 24: పశ్చిమాసియాలో నెల కొన్న ఉద్రిక్త పరిస్థితుల అంశంపై సమీక్ష నిర్వ హించే నేపథ్యంలో బుధవారం కేంద్ర ప్రభు త్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన ట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా అం శంపై పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసం గించిన విషయం తెలిసిందే. సోమవారం లోక్సభలో, ఇవాళ రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. ఇరాన్ సంక్షోభం వల్ల ప్రపంచవ్యాప్తంగా దీర్ఘ కాలిక ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు లోక్సభలో మోదీ అన్నారు. ఎటువంటి పరిస్థి తినైనా ఎదుర్కొనేందుకు ధీటుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ను ఎదుర్కొ న్న రీతిలో రాబోయే రోజులకు సన్నద్ధంగా ఉండాలన్నారు. ఇవాళ రాజ్యసభలో కూడా మోదీ ఈ అంశాలనే ప్రస్తావించారు. అన్ని వనరుల నుంచి గ్యాస్ను, క్రూడ్ ఆయిల్ను సకరించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల తీ వ్ర ఎనర్జీ సంక్షోభం ఏర్పడిందని, ఆ సంక్షోభాన్ని తట్టుకునే రీతిలో ప్రయత్నాలు జరుగు తున్నట్లు వెల్లడించారు. చర్చలు, దౌత్యం ద్వా రా శాంతిని నెలకొల్పాలని భావిస్తున్నామన్నా రు. యుద్ద ఉద్రిక్తతలు తగ్గాల ని, హోర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని ఆయన కోరా రు. ఒకవేళ పశ్చిమాసియా పరిస్థితులు సుదీర్ఘ కాలం కొనసాగితే అప్పుడు పరిస్థితులు భయా నకంగా ఉంటాయన్నారు. భారత్ వద్ద ప్రస్తుతం 53 లక్షల మెట్రిక్ టన్ను ల రిజర్వ్ ఇంధనం ఉన్నట్లు చెప్పారు. రాబో యే రోజుల ఆ సంఖ్యను 65 లక్షల మెట్రిక్ టన్నులకు చేర్చనున్నట్లు తెలిపారు. ఇంధన నౌకల తయారీ ప్రాజెక్టు కోసం సుమారు 70 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *