మణిపూర్ లో మరోసారి ఉద్రిక్తత

– నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ

ఇంఫాల్, ఏప్రిల్ 7: మణిపూర్ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బిష్ణుపూర్ జిల్లాలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులకు దిగారన్నారు. మంగళవారం తెల్లవారుజామున మొయిరాంగ్ ట్రోంగ్లాబి ప్రాంతంలో ఒక నివాసం పై అనుమానిత వ్యక్తులు జరిపిన బాంబుదాడిలో ఐదేళ్ల బాలుడు, ఆరు నెలల చిన్నారి మరణించగా, తల్లికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆగ్రహించిన గ్రామస్తులు ఇంఫాల్ సహా పలు ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. రహదారులను దిగ్బంధించారు. ఈ ప్రాంతంలో పెట్రోల్ బంక్ సమీపంలోని రెండు ఆయిల్ ట్యాంకర్స్, ట్రక్ కు నిప్పటించారు. మోయిరాంగ్ పోలీస్ స్టేషన్ సహా ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్ జిల్లాల్లో టైర్లను తగుల బెట్టి నిరసన వ్యక్తం చేశారు. బిష్ణుపూర్ జిల్లాలోని కేంద్ర బలగాల శిబిరంపై దాడి చేశారు. ట్రోంగ్లాయోబికి సుమారు 200 మీటర్ల దూరంలో ఈ శిబిరం ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *