– బీఆర్‌ఎస్, కాంగ్రెస్ బాహాబాహీ
– పోలీసుల లాఠీఛార్జ్.. పలువురికి గాయాలు
మంచిర్యాల, ప్రజాతంత్ర,ఫిబ్రవరి 17: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి బీఆర్‌ఎస్, సీపీఐ అభ్యర్థులు భారీ బందోబస్తుతో చేరుకున్నారు. ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదరడంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మున్సిపల్ కార్యాలయానికి బిఆర్‌ఎస్, సిపిఐ అభ్యర్థులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎంపి వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చారు. ఈ క్రమంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ రాజుకొని ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. బిఆర్‌ఎస్ కౌన్సిలర్లను చైర్మన్ ఎన్నికలో పాల్గొననివ్వకుండా పోలీసులు అక్రమ కేసులు పెట్టి అడ్డుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో పాల్గొనేందుకు వెళుతున్న 21వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ స్వర్ణలతను మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. ఆమెపై కేసు నమోదైందని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. దీంతో సుమన్ మీద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. దాడిని బీఆర్‌ఎస్ నాయకులు ప్రతిఘటించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు పోలీసులు, అధికారులను అడ్డం పెట్టుకుని మరోసారి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు కుట్రలు పన్నిందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.