– బీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ నరహరి డిమాండ్
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్ 18 : యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైన ప్రస్తుతం ఉన్న దుకాణాలను రద్దు చేసి వాటికి నూతన టెండర్లను నిర్వహిస్తే అనేకమంది కొత్తవారికి ముఖ్యంగా నిరుద్యోగులకు జీవనోపాధి దొరుకుతుందని బీఆర్‌ఎస్ యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి అన్నారు. యాదగిరిగుట్టలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొండపైన వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ రూ.40లకు అమ్మవలసిన కొబ్బరికాయను రూ.100లకు అమ్మడం దారుణమని అన్నారు. దేవస్థానం అధికారులు కొబ్బరికాయను రూ.40లకే అమ్మాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొండపైన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తక్షణమే ఆయా షాపుల నిర్వాహకులపై దేవస్థానం ఈవో తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రతిసారి ప్రస్తుతం ఉన్న వ్యాపారులకే దుకాణాలను నామమాత్రపు అద్దెను పెంచి కొనసాగించడం సరైన విధానం కాదన్నారు. దీని వల్ల అనేకమంది నిరుద్యోగులకు ఉపాధి లభించడం లేదని అన్నారు. ప్రస్తుతం ఉన్న వ్యాపారులు కొన్నేళ్లుగా ఇష్టారాజ్యంగా తమ దుకాణాలను నామమాత్రపు అద్దెతో కొనసాగించుకుంటున్నారని విమర్శించారు . కొండపైన ఒక్కో వ్యాపారికి మూడు నాలుగు దుకాణాలున్నాయని తెలిపారు. నిరుద్యోగులకు అవకాశం లేకుండా కొంతమంది వ్యాపారులు మాత్రమే పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించుకుంటూ లక్షలు కోట్లకు పోగేసుకుంటున్నారని విమర్శించారు. సమావేశంలో పట్టణ కార్యదర్శులు ఆరే శ్రీధర్ గౌడ్. దేవ పూజ, అశోక్. సీనియర్ నాయకులు పెరబోయిన సత్యనారాయణ, దండేబోయిన వీరేష్ యాదవ్, బబ్బురి వెంకటేష్ గౌడ్. కంసాని స్వామి, వాసం రమేష్, గాదపాక క్రాంతి, బుడుగే సత్తయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




