కౌలు రైతుది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ చేసిన హత్య

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని శంకరగిరి తండాకు చెందిన కౌలు రైతు వీరన్న బలవన్మ రణానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వ కుంట్ల తారకరామారావు అన్నారు. కౌలు రైతులకు కూడా ఏటా రూ.15వేల రైతు భరో సా ఇస్తామని మాటిచ్చి ముఖ్యమంత్రి మో సం చేయడం వల్లే ఈ రైతన్న నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఆరోపించారు. పెట్టుబడి సాయం మాట దేవుడెరుగు.. కనీసం ఇటీవలి తుఫాను వల్ల నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించినా ఈ కౌలు రైతు కుటుంబం రోడ్డున పడేది కాదన్నారు. ఓవైపు 700 మందికి పైగా రైతుల ఆత్మహత్యలతో రాష్ట్రంలో మరణమృదంగం మోగుతుంటే.. రేవంత్ సర్కారు విజయోత్సవాల పేరిట డ్రా మాలు చేయడం సిగ్గుచేటన్నారు. రియల్ ఎస్టే ట్ దందాలు, కుంభకోణాలు తప్ప క ర్షకుల కష్టాల గురించి కనీస అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి కావడం వల్లే వ్యవసాయం పూర్తి గా సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. కౌలు రైతు వీరన్న సెల్ఫీ వీడియో చూసిన తర్వాతైనా రేవంత్ ప్రభుత్వం గత రెండేళ్ల పాలనలో అన్నదాతలకు చేసిన మోసా లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో మోగుతు న్న ఈ చావుడప్పును ఇకనైనా ఆపకపోతే కాం గ్రెస్ సర్కారుకు లక్షలాది మంది రైతులే సమా ధి కడతారని.. ఆత్మహత్య చేసుకున్న వీరన్న కుటుంబానికి కనీసం 25 లక్షల పరిహారం అందించి, కష్టాల కడలి నుంచి ఆ కుటుం బాన్ని గట్టెక్కించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఉందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *