కనువిందు చేసిన చంద్రగ్రహణం గ్రహణం ఆలయాల మూసివేత

న్యూదిల్లీ, మార్చి 3: ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంపూర్ణ చందగ్రహణం కనువిందు చేసింది. చందగ్రహణం సందర్భంగా చందమామ పూర్తి రక్తవర్ణంలో ప్రకాశవంతంగా మెరిసిపోయింది. భారతదేశంలోని పలు ప్రాంతాలతో పాటు.. ఉత్తర అమెరికా, న్యూజిలాండ్‌, ‌ఫిలిప్పీన్స్, ‌కాలిఫోర్నియాల్లో సంపూర్ణచందగ్రహణం స్పష్టంగా కనిపించింది. ఆయా దేశాల్లో రక్తవర్ణంలో కనువిందు చేసిన చంద్రుడి ఫోటోలు సోషల్‌ ‌డియాలో వైరల్‌ అవుతున్నాయి. చందగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలు ప్రారంభమయ్యింది. సాయంత్రం 4.34 గంటలకు సంపూర్ణ చందగ్రహణం ఏర్పడింది. 5.33 గంటలకు సంపూర్ణ చందగ్రహణం వీడింది. అయితే, 6.47 గంటలకు గ్రహణం వీడుతుందని తెలిపారు.. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కనిపించిన ఈ సంపూర్ణ చందగ్రహణం మన దేశంలో మాత్రం కొన్ని చోట్ల మాత్రమే కనిపించింది.

గ్రహణంతో ఆలయాల మూసివేత

హైదరాబాద్ : సంపూర్ణ చందగ్రహణం కారణంగా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూసేశారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్క్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఉదయం 9 గంటలకు మూసేశారు. తిరిగి బుధవారం ఉదయం సంప్రోక్షణ, అభిషేక పూజల తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తారు. నిర్మల్ జిల్లా బాసర ఆలయాన్ని కూడా మూసివేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలు ఉదయం 6.15 నుంచి సాయంత్రం 7.15 వరకు మూసివేశారు. అనంతరం పుణ్యాహవాచనం, సంప్రోక్షణ నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. యాదగిరిగుట్ట లక్క్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రధాన ఆలయంతోపాటు ఉప ఆలయాలను కూడా మూసివేశారు. బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు ఆలయం తెరిచి శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం నిత్యపూజల తర్వాత దర్శనాలు ప్రారంభిస్తారు. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని గ్రహణం కారణంగా మూసివేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ, అభిషేక పూజల అనంతరం భక్తులను అనుమతి ఇస్తారు. కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7.30 వరకు మూసివేశారు. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తర్వాత భక్తులకు దర్శనం కల్పించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *