– భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాలి
– బాసర ఆలయం వద్ద ఈవీలను వాడాలి
– 6న అభివృద్ధి పనులకు శంకుస్థాపన
– ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బాసర ఆలయ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో తన క్యాంప్ కార్మాలయంలో శనివారం జరిగిన సమీక్షలో ఆలయ అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్‌పై చర్చించారు. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధిచిన మాస్టర్ ప్లాన్ ను ముఖ్యమంత్రికి అధికారులు వివరించగా ఆయన పలు సూచనలు చేశారు. భవిష్యత్ అవసరాలను, రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పరిసరాల్లో విద్యుత్ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని, తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 6న రూ.225 కోట్లతో బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కాగా, సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికె.రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





