రాష్ట్రంలో పెరుగుతున్న‌ చలితీవ్రత

-ఆదిలాబాద్‌ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8:  రాష్ట్రంలో చలి తీవ్రత మొదలైంది. గత రెండు రోజులుగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రిపూట చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో చాలాచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా బేలలో అతితక్కువగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌లో 14.7 డిగ్రీలు నమోదయింది. సంగారెడ్డిలోని జహీరాబాద్‌లో 14.8, శంకర్‌పల్లి 14.9, మొయినాబాద్‌ 15 డిగ్రీలు, ఆదిలాబాద్‌లోని భీమ్‌పూర్‌ 15, సంగారెడ్డిలోని జిన్నారంలో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక, కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్‌, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, నాగర్‌ కర్నూల్‌, యాదాద్రి భువనగిరి, జనగామ, పెద్దపల్లి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువైంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాజేంద్రనగర్‌లో 15.3, హెచ్‌సీయూలో 15.3, బీహెచ్‌ఈఎల్‌ 15.5, మల్కాజిగిరి 15.7, కుత్బుల్లాపూర్‌ 15.7, గచ్చిబౌలి 15.9, మారేడ్‌పల్లి 16, ఆర్సీపురం 16.1, బేగంపేట 16.4, నేరేడ్‌మెట్‌ 17.1, అల్వాల్‌ 17.1, కార్వాన్‌ 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కాగా, ఈ నెల 9న మరింత తకువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *