హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 9, 10 తేదీల్లో రెండవ తెలుగు లిటరరీ కాంగ్రెస్ జరగనున్నది. యువ రచయితల సాహిత్య సజన కేంద్రంగా జరగబోతున్న ఈ కాంగ్రెస్‌లో మొత్తం పది సెషన్లు ఉంటాయి. దాదాపు 55 మంది యువ కవులు, రచయితలు, నవలాకారులు, విమర్శకులు, సినిమా రచయితలు పాల్గొంటారని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింతకింది కసీం తెలిపారు. ఈ రెండు రోజులూ ఆర్ట్స్ కళాశాల ముందు బహిరంగ ఆవరణలో కవితా దునియా, కవిత జిందగీ పేర్లతో కవితా పఠనం, గాన/కళా ప్రదర్శనలు జరుగుతాయని, ఇందులో దాదాపు 40 మంది యువ కవి గాయకులు, జానపద వృత్తికళా ప్రదర్శకులు పాల్గొంటారని తెలిపారు. ఈ రెండవ కాంగ్రెస్ కు డైరెక్టర్‌గా ప్రొఫెసర్ కసీం, కన్వీనర్‌గా తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య సాగి కమలాకర శర్మ వ్యవహరిస్తారన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



