గ్యాస్‌ ‌కొరతపై నిజాలు చెప్పండి

– అసెంబ్లీ గన్‌పార్క్ ‌వద్ద బీఆర్‌ఎస్‌ ఆం‌దోళన

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్‌ ‌కొరతపై బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముందుగా గన్‌పార్క్ ‌వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు గ్యాస్‌ ‌సిలిండర్ల ప్లకార్డులతో నిరసన తెలిపారు. పెరిగిన ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. అవే ప్లకార్డులతో అసెంబ్లీకి బయల్దేరి వెళ్లారు. గ్యాస్‌ ‌కొరత లేదని చెబుతూనే హోటళ్లు, చిరు వ్యాపారులకు వాణిజ్య సిలిండర్ల సరఫరాను నిలిపివేయడంపై బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్‌ ‌కొరత కారణంగా సాధారణ ప్రజానీకంతో పాటు చిరు వ్యాపారులు, హోటల్‌ ‌వ్యాపారంపై ఆధారపడిన లక్షలాది మంది ఉపాధికి తీవ్ర విఘాతం కలిగిందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గ్యాస్‌ ‌సరఫరా సంక్షోభంపై ప్రజలకు నిజాలు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు.  యుద్ధం ప్రారంభమయ్యాక ఎల్‌పీజీ సిలిండర్ల కోసం గ్యాస్‌ ఏజెన్సీల వద్ద చాంతాడంత లైన్లు కనిపిస్తున్నాయని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్ ‌ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్  ఆరోపించారు. గ్యాస్‌ ‌కొరత లేదని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నమ్మబలుకు తోందని, క్షేత్రస్థాయిలో మాత్రం గ్యాస్‌ ‌కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్‌ ‌కొరతపై బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముందుగా గన్‌పార్క్ ‌వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు సిలిండర్ల ప్లకార్డులతో నిరసన తెలిపారు. పెరిగిన ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ కేంద్రం ఆధీనంలో పెట్రోలియం శాఖ ఉందని.. తామే చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం అంటోందని అన్నారు. ఫ్యూచర్‌లో గ్యాస్‌ ‌సిలిండర్ల సైజ్‌ ‌తగ్గిస్తారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సామాన్యులను ఇబ్బంది పెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంబోతుల కొట్లాటలో లేగలు బలైనట్లుగా సామాన్యుల పరిస్థితి ఉందన్నారు. యుద్ధం కారణంగా గ్యాస్‌ ‌కొరత చర్చనీయాంశంగా మారిందని తెలిపారు. కొరత లేదని కేంద్రం, సప్లయి లేదని రాష్ట్రం ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. గ్యాస్‌ ‌కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ ‌చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *