– ఆ ఘనత తొలి సీఎం కేసీఆర్‌దే
– మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 22 : తెలంగాణ గ్రామ పంచాయతీలు యావత్ దేశానికే ఆదర్శమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆ ఘనత ముమ్మాటికీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని అన్నారు. గత ఉమ్మడి పాలనలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని గ్రామాలకు పోరాడి సాధించుకున్న తెలంగాణలో రూపురేఖలు మార్చుకున్నామని గుర్తు చేశారు. సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకారం వేడుకకు ఆయన హాజరయ్యారు. అనంతరం నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను సత్కరించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో పదేండ్లు ఎనలేని అభివృద్ధి సాధించుకున్నామని తెలిపారు. దేశంలోనే అభివృద్ధి చెందిన గ్రామాల్లో మొదటి పది తెలంగాణ గ్రామాలే ఉన్నాయని, మొదటి 20 గ్రామాల వారీగా చూసినా 19 స్థానాలను తెలంగాణ గ్రామాలే కైవసం చేసుకున్నాయని పేర్కొన్నారు. అంతటి ఘన చరిత్ర కేసీఆర్ పాలనకే సాధ్యమైందని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలంటూ ఐక్యతతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





