ఏడాదిన్నరలో 3లక్షల కోట్ల పెట్టుబుడుల
లక్ష వరకు ఉద్యోగావకాశాల కల్పన
ఐటి కంపెనీ ప్రారంభోత్సవంతో సిఎం రేవంత్‌రెడ్డి
లక్ష వరకు ఉద్యోగావకాశాల కల్పన
ఐటి కంపెనీ ప్రారంభోత్సవంతో సిఎం రేవంత్‌రెడ్డి
తాము అధికారం చేపట్టిన తరవాత తెలంగాణకు 3లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే ఐటి తదితరరంగాల్లో లక్ష ఉద్యోగాల కల్పనకు అవకాశాలు కల్పించామన్నారు. సాప్ట్‌వేర్, లైఫ్‌సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ జీసీసీ హబ్‌గా మారిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో సొనాటా సాప్ట్‌వేర్ సంస్థను ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభించి మాట్లాడారు. ఏఐరెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. కొత్తగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించినట్లు చెప్పారు. మరిన్ని ప్రపంచ స్థాయి కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, సంక్షేమం సమతుల్యంగా సాగుతున్నాయని వివరించారు. ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో అందరి సహకారం కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా సొనాటా సాప్ట్‌వేర్ సంస్థ యాజమాన్యం, ఉద్యోగులు అందరికీ శుభాభినందనలు తెలిపారు. సొనాటా సాప్ట్‌వేర్ అత్యాధునిక పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణమన్నారు. మైక్రోసాప్ట్, కాగ్నిజెంట్, టెక్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ- దిగ్గజాలు తమ క్యాంపస్‌లను విస్తరిస్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే…. పరిశ్రమలకు మద్దతు ఇస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోందన్నారు. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు రాష్టాన్రికి కొత్తగా రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 1 లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించామని 2025లో దావోస్‌లో తెలంగాణ రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి నంబర్ 1 రాష్ట్రంగా నిలిచిందని చెప్పారు. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.





