2047 నాటికీ  దేశ ప్రగతిలో తెలంగాణ కీలక పాత్ర

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 79 వ స్వాతంత్య్ర  దినోత్సవ శుభాకాంక్షలు 

స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  … భారత ప్రజలకు 79 వ స్వాతంత్య్ర  దినోత్సవ శుభాకాంక్షలు  తెలియజేస్తూ దేశ స్వాతంత్య్రం   కోసం తమ జీవితాలు త్యాగం చేసిన మహనీయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ..గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్య్ర  పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.. 2047 నాటికి స్వతంత్ర భారతం శత వసంతాలు పూర్తి చేసుకుంటుంది…2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్నదే మా సంకల్పం…ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్‌ 2047’…2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా…2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుంది..ఇది కేవలం ప్రణాళిక కాదు… ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం..ఇది యావత్ తెలంగాణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్…మూసీ పునరుజ్జీవం నుంచి మొదలై గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ఈ విజన్ లో విస్పష్టంగా ఉండబోతోంది..వరదలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ ను… స్వచ్ఛమైన, సుందరమైన నగరంగా మార్చే సంకల్పాన్ని ఈ విజన్ ఆవిష్కరిస్తుంది…మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైదారాబాద్ వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే హామీని ఈ విజన్ డాక్యుమెంట్ ఇస్తుంది…అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే భారత్ ఫ్యూచర్ సిటీ… ఆధునిక ప్రపంచానికి గేట్ వేగా ఏ విధంగా ఉంటుందో ఈ పత్రం వెల్లడిస్తుంది..అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణ అభివృద్ధికి రాచమార్గంగా ఎలా నిలవబోతోందో తెలంగాణ రైజింగ్ – 2047 లో విస్పష్టంగా చెప్పబోతున్నాం.2047 నాటికి దేశ ప్రగతిలో తెలంగాణది కీలక పాత్రగా చేయడమే మా సంకల్పం..” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *