నైపుణ్య వృద్ధితోనే యువతలో సాధికారత

  • తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆచార్య బాలకిష్టా రెడ్డి
  • యువత మైండ్ సెట్ లో మార్పు రావాలి : డిఆర్డిఓ పూర్వపు చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి
  • కాకతీయ యూనివర్సిటీలో అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ సైన్స్​ కాంగ్రెస్ – 2025

కాళోజి జంక్షన్ /హన్మకొండ ప్రజాతంత్ర ఆగస్ట్ 19 : యువత నైపుణ్యం పెంపొందించుకోవడం ద్వారానే సాధికరత సాధిస్తారని తెలంగాణ కౌన్సిల్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆచార్య బాలకిష్టా రెడ్డి (Prof. Balakista Reddy) అన్నారు. భారతీయ యువత విద్య, వైజ్ఞానిక పరంగా ప్రపంచానికి పోటీ ఇస్తోందన్నారు. సైన్స్​ ఒక క్రమబద్దమైన అధ్యయనం అని, టెక్నాలజీతో అన్వయం ద్వా రా రూపాంతరీకరణ చెందుతుందని తెలిపా రు. నాగరికత మొదటి నుంచి తరం తరంలో గొప్ప మార్పులు వొచ్చాయన్నారు. మంగళవా రం కేయూ సెనెట్ హాల్ లో కేయూ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు(Kakatiya University Golden Jubilee) గుర్తుగా కాకతీయ విశ్వవిద్యాలయం, తెలంగాణ అకాడమీ అఫ్ సైన్సెస్ సంయుక్తంగా తెలంగాణ సైన్స్​ కాంగ్రెస్ – 2025 (Telangana Science Congress 2025) నిర్వహించింది. చైర్మన్ ఆచార్య కె.ప్రతాప్ రెడ్డి ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

మాట్లాడుతున్న ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి

ఈ సందర్భంగా ఆచార్య బాలకిష్టా రెడ్డి మా ట్లాడుతూ.. దేశంలో 60 శాతం యువత మన కు గర్వకారణమన్నారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సు అధ్యక్షుడు ఆచార్య సీహెచ్ మోహ న్​ రావు మాట్లాడుతూ సామాజిక పరివర్తనకు సైన్స్​ ఒక సాధనమన్నారు. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి జీవన ప్రమాణం, అక్షరాస్యత పెరిగిందన్నారు. విద్యార్థులు క్రిటికల్ థింకిం గ్ నైపుణ్యం కలిగి ఉండాలన్నారు. మన రక్షణ వ్యవస్థ చాలా బలీయమైందని ఆపరేషన్ సిం ధూర్ తో ప్రపంచానికి తెలిసిందన్నారు. కొవి డ్ తో మన శాస్త్ర పరిజ్ఞానాన్ని ప్రపంచం ముం దు తలమానికమైందని తెలిపారు. తెలం గాణ అకాడమీ ఆఫ్ సైన్సు ఆవిర్భావం, ఆంధ్రప్ర దేశ్ అకాడమీ ఆఫ్ సైన్స్​ నుంచి వచ్చింద న్నారు. కేయూ 50 ఏళ్లలో అడిగిడుతుంద న్నారు. ఆర్థిక సంస్కరణల పితామహుడు పి.వి.నరసింహ రావు కేయూ పూర్వ విద్యార్ధి అని గుర్తు చేశారు.

sathish-reddy
మాట్లాడుతున్న డాక్టర్ జి.సతీష్ రెడ్డి

ముఖ్య అతిథి డిఆర్డిఓ పూర్వపు చైర్మన్, భారత ప్రభుత్వ మినిస్ట్రీ అఫ్ డిఫెన్సు సైంటిఫిక్ అడ్వై సర్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి (Dr. G Satheesh Reddy ) మాట్లాడుతూ.. ఇన్నోవేటివ్ స్కిల్స్ ఫర్ ఎంపవర్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ యంగ్ ఇండియా” థీమ్ తో సైన్స్ కాంగ్రెస్ నిర్వహిం చడం అభినందనీయమని కొనియాడారు. ఎక్కువ మంది విద్యార్థులు ఆవిష్కరణలు చేయడం భారత్​కు ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు. 4.34 కోట్ల విద్యార్థులు ఉన్న త విద్యను అభ్యసిస్తున్నారని వివరించారు. ఈ సంఖ్య కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ అన్నారు. భారతీయ యువత ఎక్కువ మంది ప్రపంచం వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. 1.5 మిలియన్ మంది దేశం నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారని తెలిపారు. 90 శాతం మంది ఉద్యోగాలు పొందుతున్నారని అన్నా రు. 2016 లో కేవలం 458 స్టార్ట్ అప్స్ ఉన్నా యి. ప్రస్తుతం 1.75 మిలియన్ స్టార్ట్ అప్స్ వచాయని ప్రశంసించారు. ఆవిష్కరణలు ప్ర స్తుత స్థితిని మారూస్తున్నాయి ఇది విప్లవాత్మక మార్పు అని కొనియాడారు. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆలోచన సరళి ముఖ్య మన్నారు. యువత మైండ్ సెట్ ప్రస్తుతం మారాల్సిన అవసరం ఉందని సూచించారు. యువత తమ ఆవిష్కరణలు దేశానికి ఉపయోగ పడేలా వుండాలనే మైండ్ సెట్ రావాలన్నారు. ప్రపంచ సాంకేతికతో పోటీ పడే మనస్తత్వం యువతలో పెరగాలని కో రారు. ఆవిష్కరణలో కొత్తదనం, ఏఐ. ఏం ఎల్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం టెక్నాలజీలో అధ్యయనం, పరిశోధనకు యువత ముందుకు రావాలన్నారు. ప్రపంచానికి భారత్ అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా కేయూ వీసీ ప్రొఫెసర్​ ప్రతాప్​రెడ్డి మాట్లాడుతూ ప్రజాసంక్షేమం, సేవ సై న్స్​ లక్ష్యం కావాలన్నారు. యువత శాస్త్రీయ దృక్పథంలో ముందడుగు వేయాలని కోరారు. క్వాంటం ఫిజిక్స్, ఎన్విరాన్మెంట్, ఆర్టిఫిసియ ల్ ఇంటలిజెన్స్ నూతన శాస్త్ర, సాంకేతిక రంగాలలో యువత ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్ – 2047, తెలంగాణ రైజింగ్ దిశగా నడుస్తున్నట్లు పేర్కొన్నారు.

కెయు రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం మాట్లాడుతూ మూడు రోజుల తెలంగాణ సైన్సు కాంగ్రెస్ (Telangana Science Congress ) కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు, సహకరించిన సంస్థల కు కృతఙ్ఞతలు తెలిపారు. తెలంగాణ సైన్సు కాంగ్రెస్ ఆర్గనై జింగ్ సెక్రటరీ ఆచార్య బి. వెంకట్రామరెడ్డి మాట్లడుతూ ఇన్నోవేటివ్ స్కిల్స్ అండ్ ఎంప వర్​ మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్​ఫర్మె షన్​ యంగ్ ఇండియా పై నిర్వహించటం హర్షం వ్యక్తమవుతుందన్నారు.
విశ్వవిద్యాలయం లో ఏర్పాట్లు చేసినట్టు, వివిధ సెమినార్ హాల్ లలో థిమటిక్ సెషన్, ప్లీనరీ సెషన్లు, పాఠశాల విద్యార్థులతో శాస్త్ర వేత్తల ముఖాముఖి, పాఠశాల సైన్సు టీచర్లతో సమావేశం, ఎగ్జిబిషన్లు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ అకాడమీ అఫ్ సైన్సెస్ జనరల్ సెక్ర టరీ ఆచార్య ఎస్. సత్యనారాయణ, ట్రెజరర్ ఆచార్య ఎస్.ఎం. రెడ్డి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ఆచార్య అల్తాఫ్ హుస్సేన్ తో పాటు తెలంగాణా అకాడమి ఆఫ్ సైన్స్​ ఫెలోలు, పాలకమండలి సభ్యులు, పరిశోధకులు, విద్యార్థులు,శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. అతిథులు సైన్సు కాంగ్రెస్ సంక్షిప్త సంచికను విడుదల చేశారు. తెలంగాణ అకాడమీ అఫ్ సైన్సు సహకారంతో ఆలిండియా రేడియో విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ “భారతదేశంలో తొలి వనిత వైద్యులు” పుస్తకాన్ని, కాకతీయ విశ్వవిద్యాల య జియాలజి విభాగ పూర్వపు విద్యార్ధి ఎ.జి.ఎస్. రెడ్డి రచించిన “ది రీసెర్చర్స్ కంపాస్” పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *