తీరిన ఫీజు రీయింబర్స్​ మెంట్​ కష్టాలు

  • నేడు యథావిధిగా తెరుచుకోనున్న కళాశాలలు
  • ఈ వారంలో రూ.600కోట్లు, దీపావళికి మరో రూ.600కోట్ల నిధులు విడుదల
  • బంద్​ నిర్ణయాన్ని విరమించుకున్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలల బంద్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ (Fee Reimbursement) బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఆదివారం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో డి ప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రి శ్రీధర్ బాబు , సీఎస్ రామకృష్ణరావు, హయ్యర్ ఎ డ్యుకేష న్ చైర్మన్, ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కార్యదర్శలు, ప్రైవేటు కాలేజీల యా జమాన్యాలతో సుదీర్ఘంగా చర్చించా రు. ఈ సందర్భంగా ​డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ ప్రైవేటు కళాశాలల సమ స్యలను ప్రభుత్వం అర్థం చేసుకుందన్నారు. ఈచర్చలు సాను కూ లంగా కొనసాగాయని, ఆది వారం కాబట్టి, సోమవారం ప్రభుత్వపరంగా ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పటివరకు సమ్మె ను విరమించమని యాజమాన్యాలను కోర గా, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ​ఫీజు రీయింబర్స్‌మెంట్ బకా యిల విడు దల కోసం డిమాండ్ చేస్తున్న ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో ప్రభు త్వం సోమవారం చర్చలు జరిపింది. డి ప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం న రేందర్ రెడ్డితో ఫతి చైర్మన్ రమేష్ బాబు, సెక్రటరీ జనరల్ రవికుమార్, ట్రెజరర్ కృష్ణారావు తదితరులు చర్చలు జరిపారు. చివరకు బంద్ విరమణకు ప్రైవేట్ కాలేజీ లు అంగీకరించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంగళ వారం నుంచి ఇంజనీరింగ్ కళాశాలలు యథా విధిగా తెరచుకోనున్నట్లు తెలిపారు. అయితే ఈ వారంలో రూ.600 కోట్లు, దీపావళికి మరో రూ.600 కోట్ల నిధులు ఫీ జు రీయింబర్స్‌మెంట్ కింద విడుదల చేసేం దుకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *