లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీలో దూసుకెళ్తున్న తెలంగాణ‌

– కొత్త డైరెక్టర్, సీఈవో సర్వేశ్ కు మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు అభినంద‌న‌లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ నూతన ఆవిష్కరణల్లో మరింత వేగంగా దూసుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణ బయోసైన్సెస్ డైరెక్టర్, సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సర్వేశ్ సింగ్ స‌చివాలయంలో సోమవారం తనను కలిసిన సందర్బంగా ఆయన అభినందనలు తెలిపారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తనకున్న 22 సంవత్సరాల అపార అనుభవాన్ని రాష్ట్రంలో మంచి ఎకో సిస్టంను నెలకొల్పేందుకు వినియోగించాలని సూచించారు. ప్రపంచానికి సరఫరా అవుతున్న వ్యాక్సిన్లలో మూడో వంతు రాష్ట్రం నుంచే ఎగుమతి అవుతున్న విషయాన్ని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ ఎదిగిందని తెలిపారు. ఫార్మా ఎగుమతుల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నామని తెలిపారు. జినోమ్ వ్యాలీని మరింత విస్తరించి, మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ద్వారాలు తెరుస్తున్నామని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *