రూ. 745 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల.. భట్టి విక్రమార్క ఆదేశం!
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ.745 కోట్లు విడుదల చేసింది. ఫిబ్రవరి మాసానికి సంబంధించిన బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు నిధులు విడుదల చేశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సర్కార్ గ్రీన్ ఛానల్ లో నిధులను విడుదల చేస్తోంది.ఉద్యోగులకు ప్రతినెల రూ. 700 కోట్లకు తగ్గకుండా పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అ హామీ మేరకు గత జూన్ నెలాఖరులో రూ .183 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గత సంవత్సరం ఆగస్టు నుంచి ప్రతి నెల కనీసంగా రూ .700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తోంది. విడుదలైన బిల్లులో గ్రాట్యూటీ, జిపిఎఫ్, సరెండర్ లీవ్, అడ్వాన్సులు ఉన్నాయి.





