తెలంగాణ డెవలప్‌మెంట్‌ ‌ప్లానింగ్‌ ‌సొసైటీ సలహా కమిటీ ఏర్పాటు అధ్యక్షుడిగా డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : తెలంగాణ డెవలప్మెంట్‌ ‌ప్లానింగ్‌ ‌సొసైటీ సలహా కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈనెల 14న సలహా కమిటీకి సంబంధించిన జీవో విడుదల అయింది. ఈ నేపథ్యంలో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సచివాలయంలో కమిటీ సభ్యులతో ప్రాథమిక సమావేశం జరిగింది. రాష్ట్రంలో విపత్తు నివారణకు ప్రణాళికలు, వాతావరణ మార్పుల ప్రభావం విశ్లేషణ, రాష్ట్ర ఆర్థిక, సామాజిక రంగాల్లో అంతరాలు, అభివృద్ధి విశ్లేషణ, పైలెట్‌ ‌ప్రాజెక్టులు, పరిశోధనలు నిర్వహించడం ఈ సలహా కమిటీ ప్రధాన ఉద్దేశం. ఈ కమిటీ విశ్లేషణలు రాష్ట్రంలో స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలకు మద్దతుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది.

1.డిప్యూటీ సీఎం %•% ప్రణాళిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సలహా కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

2. ప్రొఫెసర్‌ ‌కంచ ఐలయ్య -సభ్యుడు

3. ప్రొఫెసర్‌ ‌శాంతా సిన్హా -సభ్యురాలు

4. ప్రొఫెసర్‌ ‌హిమాంశు-సభ్యుడు

5. డాక్టర్‌ ‌సుఖదేవ్‌ ‌తొరాట్‌-‌సభ్యుడు

6. శ్రీ నిఖిల్‌ ‌దేవ్‌-‌సభ్యుడు

7. శ్రీ ప్రవీణ్‌ ‌చక్రవర్తి- సభ్యుడు

8. ప్రొఫెసర్‌ ‌భూక్య-సభ్యుడు ఈ

9. ప్రొఫెసర్‌ ‌పురుషోత్తం రెడ్డి-సభ్యుడు సమావేశంలో కమిటీ సభ్యులతో పాటు ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ సందీప్‌ ‌కుమార్‌ ‌సుల్తానియా, తెలంగాణ డెవలప్మెంట్‌ ‌ప్లానింగ్‌ ‌సొసైటీ సీఈవో షేక్‌ ‌మీరా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *