పదేళ్లలో తెలంగాణను ఆగం చేశారు

– ఇప్పుడేమో ఘనకార్యాలు చేసినట్లు బిల్డప్
– ఎమ్మెల్యే హరీష్ రావుపై మండిపడ్డ మంత్రి జూపల్లి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: గత ప్రభుత్వ నాయకులకు సరైన ఆలోచన, అవగాహన లేక రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. నీళ్లు లేనిచోట మాత్రం పదేళ్లలో అనేక ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు. కాళేశ్వరం ఇందుకు నిదర్శనమని అన్నారు. పాలమూరులో పదేళ్లుగా ఒక్క పపీ చేయలేదన్నారు. బీఆరఎస్ పార్టీకి ధనిక రాష్ట్రం అప్పగిస్తే రూ.8 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు కాలువలకు ఇంకా అనుమతే రాలేదన్న జూపల్లి.. పాలమూరు ప్రాజెక్టుపై రాజకీయాలు చేస్తోంది మీరా.. మేమా అని నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టును 80శాతం పూర్తి చేశామని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. అబద్దాలతోనే పాలన చేశారని, ప్రజలను మోసం చేశారని అన్నారు. హరీష్ వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయని హరీష్ రావు చెబుతున్న మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. రూ.80 వేల కోట్ల అంచనా వ్యయం ఉన్న ప్రాజెక్టులో కేవలం రూ.25 వేల కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులు ఎలా పూర్తి చేశారని నిలదీశారు. కనీసం కాలువల నిర్మాణం పూర్తి చేయలేదని, భూసేకరణ చేపట్టలేదని, పరిపాలనా అనుమతులు కూడా లేవని విమర్శించారు. ఎన్నికల ముందు హడావుడిగా పంపులు ఆన్ చేసి ప్రజలను వంచించారు తప్ప ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. గత పదేళ్లలో బీఆరఎస్ ప్రభుత్వం పాలమూరుపై రూ. 7 వేల కోట్లు ఖర్చు చేస్తే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రూ.8,300 కోట్లు వెచ్చించాయని గుర్తు చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్ భూసేకరణలో భాగంగా 2.5 శాతం మంది రైతులకు మాత్రమే నష్టం వాటిల్లుతోందని, కానీ 97.5 శాతం మంది రైతులకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *