తెలంగాణ సంస్కృతిని చాటే పండుగ బ‌తుక‌మ్మ‌

– రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా, సంప్రదాయ సౌందర్యానికి ప్రతి రూపంగా, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆమె బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. మన తల్లులు, అక్కాచెల్లెళ్లు భక్తిశ్రద్దలతో అలంకరించే బతుకమ్మలు కేవలం పూల సమాహారమే కాదు.. అవి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సామూహిక జీవన సౌందర్యానికి సజీవ రూపమని పేర్కొన్నారు. బతుకమ్మ పూలతో ప్రకృతిని ఆరాధించడం, గౌరమ్మను సత్కరించడం, సోదరీమణులు కలసి ఆడుతూ పాడుతూ జరుపకునే ఈ పండుగ తెలంగాణ సంస్కృతి ప్రత్యేకతను ప్రతిబింబిస్తుందన్నారు. బతుకమ్మలో ఉపయోగించే ప్రతి పువ్వుకీ ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉంటాయని, తీరొక్క పూలతో ప్రకృతి మాతకు కృతజ్ఞత చాటే పండగ బతుకమ్మ అని కొనియాడారు. ఈ పండుగ ప్రతి ఇంటినీ సంతోషాలతో నింపాలని, మన తెలంగాణ తల్లికి మరింత కీర్తి చేకూర్చాలని ఆకాంక్షించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *