తెలంగాణ ఆడిట్ శాఖ దేశంలోనే నెంబర్ వన్

– గుజరాత్ ఆడిట్ శాఖ ఉన్నతాధికారులతో భట్టి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: ఆన్‌లైన్ ఆడిటింగ్‌లో అత్యుత్తమ ప్రమాణాలతో తెలంగాణ ఆడిట్ శాఖ దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిందని, వరుసగా మూడుసార్లు దేశంలో నెంబర్ వన్ ర్యాంకు సాధించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్రంలో ఆన్‌లైన్ ఆడిటింగ్ వ్యవస్థను పరిశీలించేందుకు వచ్చిన గుజరాత్ ఆడిట్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. గుజరాత్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఉన్నతాధికారులందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నానన్నారు. తమ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు అత్యంత బలంగా ఉన్నాయని అధికారులకు వివరించారు. రాష్ట్రంలో ఆడిట్ శాఖ పనితీరు అధ్యయనానికి అవసరమైన పూర్తి సహాయసహకారాలను అందిస్తామని, రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోవడానికి తమ అధికారులు పూర్తిగా సహకరిస్తారని గుజరాత్ అధికారులతో డిప్యూటీ సీఎం తెలిపారు. రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీలను సందర్శించి ఆన్‌లైన్ వ్యవస్థను అధ్యయనం చేస్తున్నామని, రాష్ట్రంలో ఆడిటింగ్ వ్యవస్థ పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగుతున్నదని గుజరాత్ అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, తెలంగాణ ఆడిట్ శాఖ డైరెక్టర్ నరసింహన్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *