యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్ 18 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (సీహెచ్ నవీన్ కుమార్) మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకారం వేదపండితులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి స్వామివారి లడ్డు ప్రసాదం, ఫోటో అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




