– తెలంగాణ రాజ్య సాధన పార్టీగా నామకరణం
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్17: తెలంగాణలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కొత్త రాజకీయ పార్టీని పెట్టారు. తన పార్టీకి తెలంగాణ రాజ్యసాధన పార్టీగా నామకరణం చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో కొత్త రాజకీయ పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. తీన్మార్ మల్లన్న పార్టీ జెండాను రెండు రంగులతో ప్రత్యేకంగా రూపొందించారు. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వొచ్చాయి. బీసీ కులగణన సర్వేపై అనుచిత వ్యాఖ్యలు, పార్టీ విధానాలు ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్పడినట్లు కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. దీంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే మల్లన్న నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో మే 1న కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేశారు. ఈ మేరకు బీసీ భావజాలాన్ని ప్రజల్లోకి మల్లన్న బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రకటించారు. అయితే ఈ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తుందో వేచి చూడాల్సిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



