హైదరాబాద్-జకార్తా మధ్య టెక్నాలజీ స్కిల్ కారిడార్

– ఇండోనేషియా డిజిటల్ ప్రతిపాదనకు తెలంగాణ సానుకూలత
– ‘నేషనల్ డిజిటల్ రోడ్ మ్యాప’కు సాంకేతిక సహకార
– మంత్రి శ్రీధర్‌బాబుతో ఇండోనేషియా అత్యున్నతస్థాయి బృందం భేటీ

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: హైదరాబాద్ – జకార్తా నగరాల మధ్య సాంకేతిక నైపుణ్యాల మార్పిడి కోసం ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సుముఖంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇండోనేషియా డిజిటల్ పరివర్తన ప్రయాణంలో టెక్నాలజీ హబ్‌గా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న తెలంగాణ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. న్యూదిల్లీ భారత్ మండపంలో నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఇండోనేషియా కమ్యూనికేషన్స్ అండ్ డిజిటల్ అఫైర్స్ వైస్ మినిస్టర్ నెజార్ పాత్రియా (నేతృత్వంలోని అత్యున్నతస్థాయి బృందంతో మంత్రి శ్రీధర్‌బాబు గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ, ఇండోనేషియా మధ్య డిజిటల్ భాగస్వామ్యం, స్కిల్ డెవలప్‌మెంట్, ప్రతిభావంతుల గుర్తింపు, టెక్నాలజీ ఇన్నోవేషన్స్, స్టార్టప్ ఎకో సిస్టం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ – జకార్తా టెక్నాలజీ స్కిల్స్ డెవలప్‌మెంట్ కారిడార్ ఏర్పాటుకు చొరవ చూపాలని నెజార్ పాత్రియా విజ్ఞప్తి చేశారు. ఇండోనేషియా అమలు చేస్తున్న నేషనల్ డిజిటల్ రోడ్‌మ్యాప్‌కు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించాలని కోరారు. తమ అంకుర సంస్థలకు, స్టార్టప్ ఎకో సిస్టం బలోపేతానికి మార్గనిర్దేశం చేయాలని ఆహ్వానించారు. ఇండోనేషియా ప్రతిపాదనలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించారు. ఇండోనేషియా డిజిటల్ పరివర్తనలో తెలంగాణ కీలక భాగస్వామిగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ టెక్ టాలెంట్‌ను ఇండోనేషియా డిజిటల్ అవసరాలÅ£నుగుణంగా అనుసంధానం చేస్తామన్నారు. కృత్రిమ మేధ వినియోగంలో నైతిక ప్రమాణాలు, పాలసీల రూపకల్పనలో సహకరిస్తామన్నారు. మన ఐటీ ఎకో సిస్టం, అనుభవాన్ని ఇండోనేషియా డిజిటల్ లక్ష్యాలకు అనుసంధానించడం ద్వారా ప్రపంచ పటంలో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుందని మంత్రి శ్రీధర్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *