ప్రియ మిత్రుడికి అశృనీరాజ‌నాలు!

ఎవరీ మునీర్ భాయ్ చ‌నిపోయాడంటే న‌మ్మ‌బుద్ధి కావ‌డంలేదు. కానీ అతను తిరిగిరాని లోకాల‌కు వెళ్లి వారం రోజులు గ‌డిచినా ఇంకా బంధువులు కానివారు, బాల్య స్నేహితుల దగ్గర నుండి ఆయనకు మొన్న మొన్న పరిచయం అయినవాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? ఎందుకంటే అత‌నొక నిబ‌ద్ధ‌త క‌లిగిన విలేక‌రి కాబ‌ట్టి! స‌హ‌చ‌రుడు క‌నుక‌ విలేక‌ర్లు వ‌రుస‌గా ఆయ‌న‌పై క‌థ‌నాలు రాసివుండ‌వ‌చ్చు. కానీ ఆయనకు ఆరోగ్యం బాగా లేద‌ని తెలిసినప్పటి నుండి అందరూ ఎందుకు మదన పడ్డారు? బాక్సింగ్ చాంపియన్ అయిన ఆయనకు,  ధూమ‌పాన‌, మ‌ద్య‌పాన అల‌వాట్లు లేవు.  రోజూ వాకింగ్ చేసేవాడు 70 ఏళ్ళు కూడా నిండ లేదు కదా! ఎందుకంటే ఆయన తండ్రి సింగరేణి లో ఉద్యోగి, తను బెల్లంపల్లి లేదా మందమర్రి లోని బొగ్గు గనుల ప్రాంతం లోనే పుట్టాడు.

త‌న 68 ఏళ్ల జీవితంలో చివరిరోజు వరకు అదే బొగ్గు గని ప్రాంతంలో గడిపాడు. మరి మునీర్ భాయ్ తో పాటు ఈ ప్రాంతానికి చెందిన చాలామంది జబ్బుల బారిన ఎందుకు పడుతున్నారు? సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో పుట్టి గనుల్లో పని చేసే ఉద్యోగులకు మాత్రమే కాకుండా అక్కడ నివసించే వారంద‌రికీ  జబ్బులు ఎందుకు వస్తున్నాయి? బొగ్గు మింగి బొగ్గు విస‌ర్జించే అక్కడి ప్రజలకు 1980 ల వరకు బొగ్గు పొయ్యిలనుండి వచ్చే గ్యాస్, లారీల తో పాటు కోల్ స్క్రీనింగ్,హాండ్లిన్గ్ ప్లాంట్ (సీఎస్ పీ, సీహెచ్‌పీ )ల నుండి వచ్చే దుమ్ము ధూళి పీల్చ‌డం అల‌వాటైపోయింది. ప్రతీ రోజూ వేల టన్నులు వెదజల్లి గాలి లో కలపడం (కలవడం)వల్ల వేల మంది అనారోగ్యం పాలవుతున్నారు.  తెలంగాణ రాకముందు టీవీవీ, టీజేఏసీల  తరపున పిట్టల రవీందర్ నాయకత్వంలో మేమంతా డాక్టర్ గీతాంజలితో కలిసి మాదారం నుండి మణుగూరు వరకు జాతీయ మీడియాను ఇన్వాల్వ్ చేసి అధ్య‌య‌నం చేసి నివేదిక త‌యారుచేసాం. పుస్తకాలు కూడా ముద్రించాం.

1970 ల నుండి ఓపెన్ కాస్ట్ మైనింగ్ వ‌ల్ల విడుద‌ల‌య్యే వెలువడే రక రకాల రసాయన అంటే కార్బన్ డైయాక్స‌యిడ్, కార్బ‌న్ మోనాక్స‌యిడ్‌, మీథేన్ వంటి వాయువుల కాలుష్యం  వేలరెట్లు పెరిగిపోయింది. ఊపిరి తిత్తుల క్యాన్సర్‌, ఊపిరి తిత్తుల టీ బి, షుగర్, బీ పీ, అస్తమా. మోకాళ్ళ నొప్పులు మొద‌లైన జ‌బ్బు లు వ‌స్తున్న‌ట్టు ఈ అధ్య‌య‌నాల వ‌ల్ల బ‌య‌ట‌ప‌డింది. సరిగ్గా ఇక్కడే ముఖ్యంగా మునీర్ భాయ్ ఎక్కువ కాలం సీఎస్‌పీ, సీహెచ్‌పీ లో పనిచేయడం వల్ల బొగ్గు దూళి తనకు తెలియ కుండానే ఊపిరి తిత్తు ల్లో పేరుకు పోవ‌డంతో జబ్బు బారిన పడ్డాడు. ఇందుకు భౌతిక అనారోగ్య కారణాలకు తోడు మానసిక హింసకూడా తోడైంది. అందుకు సింగరేణి యాజమాన్య మే కారణం. ఎందుకు, ఎలా?

శ్రీపతి రావ్ ను చంపి ఆ కేసులో  త‌న స‌హ‌చ‌రుల‌తో క‌లిసి కొన్ని సంవత్సరాల జైలు జీవితాన్న అనుభవించాడు. తాను  బెయిల్ పై బయటకు వచ్చే సరికి ఆర్‌వైఎల్‌, ఆర్ ఎస్‌యు సికాస నాయకత్వంలో పోరాటాలు ఉధృతంగా  కొన‌సాగుతున్నాయి. ఇవ‌న్నీ చూసి తాను ఉద్యోగం చేస్తూనే  విలేక‌రిగా వివిధ స‌మ‌స్య‌ల‌పై ముఖ్యంగా స్త్రీల స‌మ‌స్య‌ల‌పై ఎంతో త‌ప‌న‌తో క‌థ‌నాలు రాసేవాడు. తాను హాస్పిట‌ల్ బెడ్‌పై గ‌డిపిన ఆఖ‌రి రోజున కూడా ఇటువంటి వార్త‌లు రాసాడు. అత‌ని నిరంత‌ర త‌ప‌న నుంచి వ‌చ్చిందే మా తుఝే స‌లాం పుస్త‌కం. ఇందులో కార్మికుల స‌మ‌స్య‌ల‌తో పాటు సింగ‌రేణి యాజ‌మా న్యం అవినీతి అ్ర‌క‌మాల‌ను బ‌య‌ట‌పెట్టాడు. సింగ‌రేణి ప్రాంతంలో ప‌నిచేసిన విలేక‌ర్ల‌లో మునీర్‌భాయ్ రాసిన‌న్ని వ్యాసాలు, క‌థ‌నాలు మ‌రెవ‌రూ రాయ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు.

మందమర్రి లో కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఫ్యూడల్ దొర శ్రీపతి రావ్ ఆయన గుండాల ఆగడాలు చూసిన ఆ ఆగడాల వల్ల తన చుట్టూ వున్న కుటుంబాలు అన్ని రకాల శారీరక ఆర్ధిక, మానసిక హింసలకు గుర‌వుతూ పడుతున్నవేద‌న చూస్తూనే పెద్ద‌వాడ‌య్యాడు. య‌వ్వ‌నారంభంలో ఈ హింస‌ల‌కు వ్య‌తిరేకంగా సీపీఐ, ఏఐటీయూసీలు ఇటువంటి హింస‌ల‌కు వ్య‌తిరేకంగా చేస్తున్న పోరాటాల ప్ర‌భావం ఈయ‌న‌పై బ‌లీయ‌మైన ముద్ర‌వేసింది. స‌రిగ్గా అదేస‌మ‌యంలో నేను 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాను. నేను జెడ్పీ హైస్కూల్‌లో చదువు కొన‌సాగించ‌గా, నా బాల్య స్నేహితుడైన మునీర్‌భాయ్ సీఎస్ ఐలో చ‌దివేవాడు. త‌ర్వాతి కాలంలోనే నేను ఆర్‌వైఎల్‌లో చేర‌గా తాను ఏఐఎస్ ఎఫ్‌లో చేరి క్రమంగా నాయ‌క‌త్వ స్థాయికి ఎదిగాడు. దొరల,గూండాల అన్యాయాలను ఎదిరించాడు.  బొగ్గు లారీ (కాంటా )వద్ద జరిగే ఉద్యమాల్లో పాల్గొన్నాడు. చివ‌ర‌కు శ్రీపతి రావ్ ను చంపి ఆ కేసులో  త‌న స‌హ‌చ‌రుల‌తో క‌లిసి కొన్ని సంవత్సరాల జైలు జీవితాన్న అనుభవించాడు. తాను  బెయిల్ పై బయటకు వచ్చే సరికి ఆర్‌వైఎల్‌, ఆర్ ఎస్‌యు సికాస నాయకత్వంలో పోరాటాలు ఉధృతంగా  కొన‌సాగుతున్నాయి. ఇవ‌న్నీ చూసి తాను ఉద్యోగం చేస్తూనే  విలేక‌రిగా వివిధ స‌మ‌స్య‌ల‌పై ముఖ్యంగా స్త్రీల స‌మ‌స్య‌ల‌పై ఎంతో త‌ప‌న‌తో క‌థ‌నాలు రాసేవాడు. తాను హాస్పిట‌ల్ బెడ్‌పై గ‌డిపిన ఆఖ‌రి రోజున కూడా ఇటువంటి వార్త‌లు రాసాడు. అత‌ని నిరంత‌ర త‌ప‌న నుంచి వ‌చ్చిందే మా తుఝే స‌లాం పుస్త‌కం. ఇందులో కార్మికుల స‌మ‌స్య‌ల‌తో పాటు సింగ‌రేణి యాజ‌మా న్యం అవినీతి అ్ర‌క‌మాల‌ను బ‌య‌ట‌పెట్టాడు. సింగ‌రేణి ప్రాంతంలో ప‌నిచేసిన విలేక‌ర్ల‌లో మునీర్‌భాయ్ రాసిన‌న్ని వ్యాసాలు, క‌థ‌నాలు మ‌రెవ‌రూ రాయ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు.

పైన పేర్కొన్నట్టు తన శారీరక, మానసిక సమస్యల కు సింగరేణి యాజ‌మాన్యం ఎట్లా బాధ్యురాలు అవుతుంద‌నే ప్ర‌శ్న స‌హజంగానే ఉద‌యిస్తుంది. కానీ కచ్చితంగా సింగ‌రేణి యాజ‌మాన్యం మాత్ర‌మే కార‌ణం. ఎందుకంటే టీఎన్‌టీయూసీ, ఐఎన్‌టీయూసీల‌తో పాటు ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ ఎంఎస్‌, బీఎంఎస్‌, ఐఎఫ్‌టీయూ, టీజీకెఎస్, సికాల ట్రేడ్‌యూనియ‌న్‌ల‌కు చెందిన వంద‌లాదిమందిపై  సంస్థ యాజ‌మాన్యం ఛార్జ్ షీట్ల‌ను దాఖ‌లు చేసింది. మాతోపాటు, గురిజాల రవీందర్, భైరమళ్ళ మొగిలయ్య తదితరులను డిస్మిస్ చేసి, మునీర్‌భాయ్‌ని కూడా బ‌దిలీ చేసింది. ఇవి మాత్ర‌మే కాకుండా పోలీసు కేసుల పేరుతో బెదిరింపుల‌కు, వేధింపుల‌కు పాల్ప‌డింది.  సింగ‌రేణి యాజ‌మాన్య వేధింపుల‌కు విసిగివేసారి చివ‌ర‌కు రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించి, విలేక‌రి జీవితాన్ని మొద‌లుపెట్టాడు. ప్ర‌జ‌లే వార్త‌లు, వార్త‌లే జీవితం అన్న రీతిలో జీవితాన్ని కొన‌సాగించాడు. బాల్యం నుంచి త‌న‌తో నాకు ముప్పిరిగొన్నఎన్నో మ‌ధుర జ్ఞాప‌కాలు క‌ళ్ల‌లో ఉబికి వ‌స్తున్న అశృబిందువుల మ‌ధ్య‌న క‌ద‌లాడుతుండ‌గా, నా ప్రియ మిత్రుడికి జోహార్లు అర్పిస్తున్నా.
నీ బాల్య స్నేహితుడు
టీవీవీ గురిజాల ర‌వీంద‌ర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *