‘టెట్’ రద్దు కోసం 24న న్యూదిల్లీలో టీచర్ల ఆందోళన

వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 22: ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా ప్రైమరీ టీచర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈనెల 24న న్యూదిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించే మహాధర్నాల్లో పాల్గొనాలని ఆల్ ఇండియా ప్రైమరీ టీచర్స్ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి వైఎస్ శర్మ, జాతీయ కార్యవర్గ సభ్యులు డి.నగేష్, జాతీయ కౌన్సిల్ సభ్యులు పి.విక్రమ్ బాబు పిలుపునిచ్చారు. తెలం గాణ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో టీచర్స్ అధిక సంఖ్యలో పాల్గొని ఉపాధ్యాయ లోకం ఐక్యత ను, శక్తిని చాటాలని కోరారు. ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యా యులు పాల్గొనాలని ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్య క్షులు మల్లికార్జున్ రెడ్డి, ప్రధాన కార్య దర్శి కె.శారద, ఆర్థిక కార్యదర్శి శౌరి, రాష్ట్ర నాయకులు ప్రభాకర్, బద్రి, వరలక్ష్మి, బబిత తదితరులు మరో ప్రకటనలో పిలుపు నిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *