శ్ర‌మ‌కు గుర్తింపు ఉత్త‌మ ఉపాధ్యాయ పుర‌స్కారం

– విద్యార్థుల భ‌విష్య‌త్తు తీర్చిదిద్దేది టీచ‌ర్లే
– డ్రాప‌వుట్‌ల‌ను నివారించాలి
– ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో మౌలిక స‌దుపాయాలు
– మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 16: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పుర‌స్కారం నిరంతర శ్రమ అంకిత భావానికి త్యాగనిరాతికి దక్కిన గుర్తింపు మాత్రమేన‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. మంగ‌ళ‌వారం అబిడ్స్ లోని స్టాన్లీ కాలేజీ లో హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధ్వర్యంలో నిర్వ‌హించిన‌ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఉత్త‌మ ఉపాధ్యాయులుగా ఎంపికైన 108మందిని స‌త్క‌రించారు. ఆయ‌న మాట్లాడుతూ మీరు కేవలం పాఠ్యపుస్తకాలోని పాఠాలు చెప్పే యంత్రాలు కాదు మీరు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులన్నారు. వారిలో జ్ఞానాన్ని నైతిక విలువలను క్రమశిక్షణ నింపి వారిని ఉత్తమ పౌరులుగా మార్చే మహోన్నతమైన బాధ్యత మీపై వున్న‌ద‌న్నారు. తరగతి గదిలో మీరు నాటే జ్ఞానబీజాలే రేపటి సమాజానికి ఫలాలను ఇచ్చే మహ వృక్షాలుగా ఎదుగుతాయ‌న్నారు.  హైద‌రాబాద్ జిల్లా అక్ష‌రాస్య‌తా శాతం 83 కి పైగా ఉండడం మనందరికీ గర్వకార‌ణ‌మ‌న్నారు. మన జిల్లాలో 2300 పైగా పాఠశాలలు ఉన్నాయి 690 ప్రభుత్వ పాఠశాలలో సుమారు లక్ష మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వారికి 5000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం డ్రాప‌వుట్‌ను పూర్తిగా నివారించడం ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం మన ముందున్న లక్ష్యాలు. ఈ లక్ష్య సాధనలో మీ అందరి భాగస్వామ్యం అత్యంత కీలకమ‌న్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల ప్రోగ్రాం కింద పాఠశాల మరమ్మత్తులు చేయడం, డిజిటల్ తరగతి గదులు, ఏఐ పాఠాలు, యంగ్ ఇండియా ప్రభుత్వ పాఠశాలలు వంటి ఎన్నో కార్యక్రమాలను ప్ర‌భుత్వం చేప‌ట్టింద‌న్నారు. స‌మాజాభివృద్ధికి ఉప‌యోగ‌ప‌డేది విద్య‌ మాత్ర‌మేన‌న్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు, ఫ్రీ విద్యుత్, ఫ్రీ వాటర్ ,బుక్స్, ఉపాధ్యాయ నియామకాలు ,ప్రమోషన్ల అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామ‌న్నారు. చాలా పాఠశాలలో 10 మంది ఉపాధ్యాయులు ఉంటే 50 మంది విద్యార్థులు కూడా ఉండడం లేదు. ఎవరిని తప్పు పట్టడం లేదు.. ప్రభుత్వ పాఠశాలలు అంటే నామోషి అనే పరిస్థితి ఏర్పడ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మ‌న్నారు. తల్లిదండ్రుల మైండ్ సెట్ మార్చే బాధ్యత అధ్యాపక వర్గానిద‌న్నారు. టీచ‌ర్ల వ్యవహార శైలి,విద్యా బోధన తీరు మారాల‌న్నారు. పిల్లలకు అర్థమయ్యే విధంగా సామాజికంగా విద్యా బోధన మారాల‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *