– తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్(టీఎల్‌ఎంఏఎల్) ఎండీ టిమ్ రైఫిల్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. భారత దేశంలో సీ-130 జే సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ ఏర్పాటు చేయనున్నది. అంతర్జాతీయ అవసరాల కోసం భారత దేశంలోని టీఏఎస్ఎల్‌లో ఎఫ్-16 వింగ్స్‌ను ఉత్పత్తి చేసేందుకు టీఏఎస్ఎల్‌తో లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు టిమ్ రైఫిల్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





